సబ్ ఫీచర్

కాలా చష్మా ..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వేసవికాలం వేడెక్కిస్తోంది. చర్మం, జుట్టుతో పాటు కళ్లనూ కాపాడుకోవాలి. చలువకళ్లద్దాలు వాడితే అందంతో పాటు ఆరోగ్యం కూడా.. వేసవిలో బయటకు వెళ్లాల్సి వస్తే తప్పనిసరిగా కళ్లద్దాలు ధరించాలి. ఎందుకంటే ఈ అద్దాలు ప్రమాదకరమైన అతినీలలోహిత కిరణాలను మన కంటివరకు చేరనివ్వకుండా అడ్డుపడతాయి. వేసవిలో కళ్లకలక వచ్చే అవకాశాలు ఎక్కువ. అందుకే వేసవి కాలంలో కళ్లద్దాలు ధరించడం వల్ల వ్యాధుల బారినపడకుండా జాగ్రత్తలు తీసుకోవచ్చు. మండే ఎండల్లో గాలి, దుమ్మ, ధూళి శాతం ఎక్కువ. వీటివల్ల అలర్జీలు బాధిస్తాయి. చలువ కళ్లద్దాలు అలర్జీల నుండి కళ్లను కాపాడుతాయి. మరి ఏ ముఖాకృతికి ఏ చలువ కళ్లద్దాలు వాడితే బావుంటుందో ఓ సారి చూద్దామా!
* గుండ్రటి ముఖాకృతి ఉన్నవారు గుండ్రటి కళ్లద్దాలను ఎంచుకోకపోవడమే మంచిది. వీరికి చతురస్రాకార, దీర్ఘచతురస్రా కార్ర ఫేములైతే వీరికి బాగా నప్పుతాయి.
* కొంతమందికి గడ్డం చిన్నగా ఉండి నుదురు పెద్దగా ఉంటుంది. ఇలాంటి వారికి చిన్న కళ్లద్దాలు బాగుంటాయి. పిల్లికళ్లద్దాలు, వేఫేరర్ వీరికి చాలా బాగుంటాయి అని చెప్పచ్చు.
* గడ్డం పెద్దగా ఉండే వాళ్లకి గుండ్రని కళ్లద్దాలు లేదా ఏవియేటర్ షేప్ గ్లాసెస్ అయితే బాగుంటాయి. కోడిగుడ్డు ఆకారం కళ్లద్దాలయినా వీరికి బానే ఉంటాయి.
* ముఖం పెద్దగా ఉన్నవారికి పెద్ద్ర ఫేము కళ్లద్దాలు బాగుంటాయి. నయా ట్రెండ్స్
పాతకాలపు లుక్
పాతకాలంగా ఉండాలనుకుంటే గుండ్రటి కళ్లద్దాలు ఎంచుకోవచ్చు. ఈ అద్దాలు వివిధ రంగుల్లో ఉంటాయి. ఇవి పెట్టుకుంటూ కూడా మోడ్రన్‌గా కనిపించాలంటే ప్లాస్టిక్‌తో తయారుచేసిన్ర ఫేమ్‌వి పెట్టుకుంటే సరి.
ఏవియేటర్
క్యాజువల్, క్లాసీ లుక్ కావాలనుకునేవారికి ఈ అద్దాలు బాగుంటాయి. వీటిని పైలెట్లు, సైనికుల కోసం తయారుచేశారు. సన్నని మెటల్‌ఫ్రేమ్‌తో కళ్లని మొత్తం కప్పేస్తూ ఉండే ఈ అద్దాలు పెద్దగా ఉంటాయి. దీని వల్ల ఏ కోణంలో నుంచి కూడా కళ్లకు కాంతి కిరణాలు చేరవు. ఎలాంటి బట్టలపైకైనా ఈ అద్దాలు అందంగానే ఉంటాయి.
పిల్లి కళ్లద్దాలు
యాభయ్యవ దశకం నుంచి ఈ కళ్లద్దాల ట్రెండ్ నడుస్తోంది. ఆ కాలంలో మార్లిన్ ఈ అద్దాలు పెట్టుకుని కుర్రకారును ఓ ఊపు ఊపింది. ఇప్పటికీ ఈ అద్దాలు ఫ్యాషనే.
మిర్రర్డ్ గ్లాసెస్
ఈ కళ్లద్దాలను స్విమ్మింగ్, బీచ్‌లలో ఎక్కువగా ఉపయోగిస్తారు. అంటే నగరాల్లో పెట్టుకోకూడదని కాదు. ఇవి ఎక్కడ పెట్టుకున్నా మనల్ని సూపర్ కూల్‌గా మార్చేస్తాయి.
టింటెడ్.. ప్రింటెడ్
ఇవి హాఫ్ అండ్ హాఫ్ కళ్లద్దాలు. ఇందులో సగం కూల్, సగం మామూలు కళ్లద్దాలు ఉంటాయి. వీటిని చర్మపు రంగును అనుసరించి కొనుగోలు చేస్తారు. వీటిలో ప్రింటెడ్ ఫ్రే ములు కూడా దొరుకుతాయి. ఫన్నీ లుక్ కావాలనుకునేవారికి ఇవి బాగుంటాయి. కాలేజీ విద్యార్థులు వీటిని ఎక్కువగా కొంటుంటారు.
ఇప్పుడు ఏ తారలైనా పెద్ద పెద్ద కళ్లద్దాలనే ఫాలో అవుతున్నారు. పెద్ద పెద్ద ఫ్రేములు, లెన్స్‌లతో ఇవి ఫ్యాషన్ స్టేట్‌మెంట్‌గా మారిపోయాయి మరి. అందరి మనసూ దోచుకోవాలంటే ఇలాంటివే కరెక్ట్ కదా మరి!
*