సబ్ ఫీచర్

వేసవిలో కంటి సంరక్షణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముఖానికి ప్రత్యేక సౌందర్యాన్ని ఇచ్చేవి కళ్లు. వేసవిలో మండుతున్న ఎండల వేడికి కంటిలో తేమ కూడా అవిరై పోతుంటుంది. ఫలితంగా కళ్లు ఎర్ర బడటం, దురద, మంటలతో పాటు కంట్లో ఇసుక ఉన్నట్లు బాధ.. పైగా వైరస్ వల్ల ఎదురయ్యే కళ్ల కలక.. ఇలాంటి ఎన్నో సమస్యలు తలెత్తుతాయి. కాబట్టి వేసవికాలంలో కళ్లను సంరక్షించుకోవడానికి ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి.
*
ఎండలో బయటకు వెళ్ళేటప్పుడు చలువ కళ్లద్దాలు తప్పనిసరిగా ధరించాలి. అవి కణతలను కూడా కప్పేట్లుగా ఉండాలి. ఫలితంగా సూర్యుడి నుంచి వచ్చే అల్ట్రావయోలెట్ కిరణాల నుండి రక్షణ కలుగుతుంది.
* చలువ కళ్లద్దాలతో దుమ్మూ, ధూళి నుంచి కళ్లను రక్షించవచ్చు.
* వేసవిలో ప్రతిరోజూ నాలుగైదుసార్లు కళ్లని చల్లని నీళ్లతో కడుగుతూ ఉండాలి. ఫలితంగా ఎండ వేడికి కళ్లలోకి ప్రవేశించే ధూళి కణాలు తొలగించబడటమే కాకుండా కళ్లు చల్లబడతాయి.
* కళ్లు ఆరోగ్యంగా ఉండాలంటే కచ్చితంగా ఎనిమిది గంటలు నిద్ర పోవాలి.
* ఇప్పుడన్నీ కంప్యూటర్‌తో చేసే ఉద్యోగాలే కాబట్టి కంప్యూటర్ ముందు కూర్చున్నప్పుడు ఎక్కువసార్లు కళ్లు ఆర్పుతూ ఉండాలి. గంటకోసారి కళ్లను నీటితో కడిగి ఓ పది నిముషాలైనా కంప్యూటర్ చూడకుండా కళ్లు మూసుకుని కూర్చోవాలి.
* కంట్లో ఎరుపుదనం వచ్చినా, కళ్లు నీటిని కోల్పోయినా వెంటనే వైద్యున్ని స్రంపదించాలి. సొంత వైద్యాలు చేయకూడదు.
* కంట్లో దురదగా అనిపించినా గోకటం కానీ, కళ్లను రుద్దటం కానీ చేయకూడదు.
* రెండు రోజులకు ఒకసారైనా ఓ పదినిముషాలపాటు కళ్లపై చల్లని వ స్త్రాన్ని కప్పుకోవాలి.
* కీరాని ముక్కలుగా కోసుకుని దాన్ని పదిహేను నిముషాలు పాటు కళ్ల మీద ఉంచుకుంటే కూడా కళ్లకు చల్లదనం చేకూరుతుంది.
* వేసవికాలంలో కళ్లకు మేకప్ వేసుకోకుంటే మంచిది. ఎందుకంటే చెమట ఎక్కువగా వస్తున్న కారణంగా ఆ మేకప్ చెమటతో కలిసి కంట్లోకి వెళ్లి ఎలర్జీ కలిగించే ప్రమాదం ఉంది.
సమస్య ఎదురవక ముందుగానే ఇలాంటి చిన్న చిన్న చిట్కాలతో కంటి సంరక్షణ తీసుకోవడం వల్ల వేసవిలో ఎక్కువగా వచ్చే కళ్ల కలక వంటి వాటి నుంచి కూడా రక్షణ పొందవచ్చు.