సబ్ ఫీచర్

ప్రోత్సాహం అవసరమే..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మగువలకు సృజనాత్మకత సహజమే. ఉత్సాహం ఉంటే ఊపిరితో ను ఎక్కసెక్కాలు ఆడవచ్చు. మనసుతో ఆలోచిస్తే ఆకాశానే్న నేలమీదకు దింపవచ్చు. ఇంద్రధనుస్సుకు కొత్త రంగులు అద్దవచ్చు. ప్రతి మహిళలో అంతర్గతంగా ఉండే నైపుణ్యాన్ని బయటకు తీసుకొని రావాల్సిన బాధ్యత మాత్రం తల్లిదండ్రులకు ఉండి తీరాలి. చిన్నప్పటి నుంచి వారు ఏ అంశంపైన ఎక్కువ దృష్టిని పెడుతున్నారో చూసి వారు ఆసక్తి చూపే రంగంపైనా వారి దృష్టిని నిలుపడానికి చేయూత నిస్తే చాలు వారు ఆకాశమంత ఎదుగుతారు. తల్లిదండ్రులిచ్చే ప్రోత్సాహం వారిలో ఉత్సాహాన్ని రెట్టింపు చేస్తుంది. ఉత్సాహం ఉంటే ప్రోత్సాహం లేకపోయనా ముందుకు వచ్చే వారు ఉంటారు. కాని తల్లిదండ్రులుగా మీరు ప్రోత్సహించడమనేది మీ బాధ్యత గా భావిస్తే ముందుతరాలు వెలకట్టగలేని మాణిక్యాలను తయారు చేస్తారు.
ఉదా.. కొందరిలో సేవాభావం ఉంటుంది. పక్కవారు బాధ పడుతుంటే వీరు చూడలేరు. వారికి ఏదోకవిధంగా సాయం చేయాలనుకొంటారు. ఇట్లాంటి వారే రేపొద్దున మదర్‌థెరిస్సాకు అనుయాయులు కాగలుతారు.
మరికొందరు కళల పట్ల విపరీతమైన ఆకర్షణ కలిగిఉంటారు. అవి పూసలతో చేసే వస్తువులైనా, లేదా జనపనార,పురికోస ఇట్లాంటి దారాలతోనైనా లేదా మనం వృథా అనుకొన్న పారేసే వస్తువులను వారు మళ్లీ కొత్తవాటిగా చేయడంలోనైనా వారి మక్కువను చూపుతుంటారు. ఇటువంటివారిని ఎగతాళి చేయకుండా ఆ దిశగా వారిని ప్రోత్సహించాలి. అపుడే వారు కొత్త కంపెనీలకు యజమానులై ఇంకెతమందికో ఉపాధి అవకాశాలు ఇవ్వగలిగిన స్థాయికి వస్తారు.
ఇంకొంతమంది కూనిరాగాలు తీస్తుంటారు. వారిని ఎగతాళి చేయకుండా వారికి మంచి శిక్షణను ఇప్పిస్తే చాలు వారు ఎమ్‌ఎస్ సుబ్బలక్ష్మి లాంటివారు కాగలుతారు.
ఫ్యాషన్ డిజైనింగ్, సాహిత్యం, చిత్రలేఖనం, నాట్యం ఇలా ఎన్నో వున్నాయి ఎన్నుకోవడానికి. ఎదిగి విజయ బావుటా ఎగురవేయడానికి!
దేన్నైనా చాలెంజ్‌గా తీసుకొని చరిత్ర సృష్టించడానికి వారికి మీరు అండగా నిలబడండి. వారు వెదికే వెరైటీకోసం పాకులాడనివ్వడానికి అవకాశాన్ని అందివ్వండి. వారు రేపొద్దున గిన్నిస్‌బుక్‌లో చోటుసంపాదించుకోవచ్చు. వారు చూపించే వెరైటీని పదిమంది దృష్టికి తీసుకురండి పదిమందిలో గుర్తింపు తెచ్చుకొనేలా వారికి ధైర్యాన్నివ్వండి. ఒక ఉన్నతమైన సార్ధకతకోసంపనిచేసేవారికి తోడుగా ఉండండి.
కనుక ఎవరినైనా సరే ప్రోత్సహించడానికి ముందుకు రండి. రేపే వారే దేశానికి వెన్నుముకల్లా నిలబడగలుతారు.

-- సరోజ