సబ్ ఫీచర్

మార్కెట్ మాయాజాలానికి రైతన్న విలవిల

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

స్వతంత్ర భారతావని 75 ఏళ్ల వేడుక సందర్భం నాటికి అంటే- 2022 కల్లా అన్నదాతల ఆదాయాన్ని రెట్టింపు చేసే సత్సంకల్పానికి నరేంద్ర మోదీ ప్రభుత్వం కృతనిశ్చయంతో వుంది. రైతాంగం రుణభారంతో, గిట్టుబాటు ధర లేకుండా నిరాశా నిస్పృహలతో బలవన్మరణాలకు పాల్పడే అవాంఛనీయ విపత్కరతను పారద్రోలటానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కట్టుబడి ఆలోచిస్తున్నాయి. 2006లో నేషనల్ కమిషన్ ఆన్ ఫార్మర్స్ చైర్మన్‌గా అగ్రికల్చరల్ సైంటిస్ట్ ఎమ్.ఎన్.స్వామినాథన్ కమిటీ సిఫార్సుల మేరకు రైతాంగానికి పండించిన పంటకు, ‘సి 2’గా కనీస మద్దతు ధర ఉత్పత్తి వ్యయంపై 50 శాతం లాభం వుండేటట్టుగా కేంద్రం నిర్ణయించవలసి వుంది. భారతీయ వ్యవసాయ రంగం 45 శాతం సన్న, చిన్న, మధ్య, పేద నిరుపేద రైతాంగ జనాభా జీవనాధారంగా, అతి తక్కువ ఉత్పత్తి అవకాశాలకు తోడుగా ప్రకృతి వైపరీత్యాలతో సంక్షోభం ఎదుర్కొంటోంది. వ్యవసాయ రంగంలో ఉపాధి శాతం గణాంకాలను పరిశీలిస్తే ప్రపంచ సంపన్న అగ్రరాజ్యాలు వ్యవసాయంపై అమెరికా 1.5, చైనా 27.8 శాతం వుండగా ఇండియాలో 45.1 శాతం ప్రజ ఆధారపడి ఉన్నారు. గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు మన దేశంలో వ్యవసాయ రంగం ఇంకా మూలాధారంగా నెలకొని ఉంది.
రానున్న అయిదేళ్ళలో కేంద్ర ప్రభుత్వం రైతన్నల ఆదాయాన్ని రెట్టింపు చేయగలిగినా, ప్రస్తుత మార్కెట్ స్థితిగతులు, వ్యవసాయ ఉత్పత్తుల ధరవరల భారం కారణంగా వ్యవసాయ రంగానికి ఊపిరి అందించే పరిస్థితి లేదు. 2009-10 నుంచి వ్యవసాయేతర ఉత్పత్తుల ధరల పెంపుదల 3.9 కాగా, వ్యవసాయ ఉత్పత్తులపై ధరల భారం 8.4 శాతం పెరిగింది. పంట కనీస మద్దతు ధర కంటే అమితంగా ఉత్పత్తి వ్యయం, (ఎమ్‌ఎస్‌పి 55 శాతం పెరగగా) వరికి 130 శాతం, గోధుమకు 72 శాతం పెరిగింది. కేంద్ర వ్యవసాయ, రైతాంగ సంక్షేమ కార్మిక బ్యూరో ఆర్థిక సలహాదారు, యుఎన్‌ఎఫ్‌ఎఒ, వరల్డ్ బ్యాంక్, కమిషన్ ఫర్ అగ్రికల్చరల్ కాస్ట్స్ అండ్ ప్రాసెస్ 2018 నివేదిక ప్రకారం, వ్యవసాయ కార్మికుల దినసరి వేతనాలు గత అయిదేళ్ళలో రెట్టింపు కావటం సంతోషించదగ్గ పరిణామమే. కానీ మీడియం, లార్జ్ స్థాయి రైతాంగం 2009-10లో 116 శాతం, 2014-15లో 144 శాతం మాత్రమే స్ర్తి, పురుషుల దినసరి వేతనాలు పెరగటం వలన కుంగిపోతున్నారు. దేశంలో జాతీయ ఆదాయంలో కేవలం 17 శాతం మాత్రమే వ్యవసాయ రంగం అందిస్తోంది.
సంపన్న దేశాల్లో భారీ సబ్సిడీలు..
ఇక పంట దిగుబడుల అంశంలో భారతీయ వ్యవసాయ రంగం పరిస్థితి దయనీయంగా వుంది. ఆహార ధాన్యాల దిగుబడులకు సంబంధించి అమెరికాలో హెక్టార్‌కు 7,638 కెజీలు, చైనాలో 5,886 కెజీలు, బ్రెజిల్‌లో 4,640 కేజీలు ఉత్పత్తి సాధిస్తుండగా ఇండియాలో వాటికి 40, 50 శాతం తక్కువగా దిగుబడులున్నాయి. ఇవన్నీ పరిశీలిస్తే కేవలం రైతుల ఆదాయం పెంచటానికి, నిస్సహాయ రైతాంగాన్ని ఆదుకోవటానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇంకా ఎంతో చేయవలసి వుంది. సాంవత్సరికంగా సబ్సిడీ అవకాశాలు పరిశీలిస్తే, సగటున భారతీయ వ్యవసాయదారునికి 250 డాలర్లు సబ్సిడీ లభిస్తుంటే, యూరప్ యూనియన్, అమెరికా వంటి దేశాలలోని సంపన్న రైతులు 60వేల డాలర్లు సబ్సిడీ పొందుతున్నారు. డబ్ల్యుటిఒ వ్యవసాయ ఒప్పందం ప్రకారం అభివృద్ధి చెందిన దేశాలు, ఇండియాలో నిరుపేదలకు ఆహారభద్రత కల్పించటానికి రైతుల నుంచి ఎమ్‌ఎస్‌పిపై, తిండి గింజలు కొనటాన్ని వ్యతిరేకిస్తున్నాయి. అటు రైతుకు, ఇటు నిరుపేద వినియోగదారునికి కడుపునింపే ఈ సబ్సిడీకి కోట్లాది రూపాయలు కేటాయించక తప్పటం లేదు. అందువలన సమృద్ధి మిగులు ఉత్పత్తులు తక్కువ ధరలకు ఎగుమతి చేయవలసి రావటంతో, దేశీయ రైతాంగం చవుక దిగుమతుల ధరల ఆర్థిక కుంగుబాటును ఎదుర్కోవలసి వస్తోంది. ఈ విధంగా అభివృద్ధి చెందిన సంపన్న దేశాలు ఇచ్చే భారీ సబ్సిడీలు, ఇండియా వంటి పలు దేశాల వ్యవసాయ విధానానికి అరిష్టం కలిగిస్తున్నాయి.

--జయసూర్య సెల్: 94406 64610