ఆంధ్రప్రదేశ్‌

పోలీసుల వేధింపులతో యువకుని ఆత్మహత్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చిత్తూరు: ఓ కేసు విషయమై పోలీసులు వేధించడంతో మనస్తాపం చెందిన రామనాథం అనే యువకుడు వాల్మీకిపురంలో గురువారం ఆత్మహత్య చేసుకున్నాడు. తమిళనాడుకు చెందిన ఇతను కొన్నాళ్ల క్రితం వాల్మీకిపురం వచ్చి స్వీట్‌స్టాల్ నడుపుతున్నాడు. ఆన్‌లైన్‌లో పలువురిని మోసగించిన ఓ నిందితుడి గురించి వివరాలు చెప్పాలంటూ పోలీసులు రామనాథాన్ని ప్రశ్నిస్తున్నారు. ఈ సందర్భంగా పోలీసులు రామనాథాన్ని శారీరకంగా హింసించారన్న ఆరోపణలున్నాయి. తమిళనాడుకు చెందిన ఆ నిందితుడి గురించి తనకు వివరాలు తెలియవని ఎంతచెప్పినా పోలీసులు వినిపించుకోకపోవడంతో రామనాథం పురుగుమందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడని తెలుస్తోంది.