సుమధుర రామాయణం

సుమధుర రామాయణం.. (యుద్ధకాండ)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

1306. మనము సౌమిత్రితో నున్న పర్ణశాల
ఇదియె జనకజా! కిష్కింధ జూడు మిదిగా
ఇచ్చటనె సుగ్రీవునితొ సఖ్యమ్ము గల్గె
వాలి నిహతుడైన ప్రదేశమ్ము నిదియె

1307. అపుడు వైదేహి భర్తతో ‘‘రామచంద్ర!
తార యితర వానర వనితలతొ మనము
యేగుద మయోధ్యకనగ సుగ్రీవునాజ్ఞ
తారతో పుష్పకమెక్కి, రందరపుడు

1308. అవనిజా! ముందుగా నన్ను హనుమ గలసి
కొన్నదీ ప్రదేశముననె కమల నేత్రి!
జూడు మదియెగోదావరి నది యటంచు
దింపె పుష్పకము భరద్వాజాశ్రమమున

1309. పుష్పకము దిగి సీతతో రఘువరుండు
మృగము లిచ్చట జాతి వైరములు మాని
నాటలాడుచున్నవి పాముతోడ నెమలి
పులితొ లేడియు ముని తపోబలము సీత!

1310. రామచంద్రుడు పత్నితో వౌని పాద
ములకు సాష్టాంగ వందన మాచరించి
వినయ భాషల స్వామి యయోధ్య వాసు
లతొ భరతుడు క్షేమము తాపసేంద్ర యనగ

1311. మందహాసముతో భరద్వాజ వౌని
రామ! కుశలమే నందరు భరతుడు తమ
యాజ్ఞ సల్పుచు మునివృత్తి యెదురు జూచు
చుండె నీకై పాదుకల ముందుంచు కొనియు

1312. అంత రాముడు జానకీ లక్ష్మణులతొ
మునికి పాదాభివందనములను జేసి
వెళ్ళుట కనుమతింగోర వాసవనుత!
నా యతిధి పూజ గ్రహియించి యేగు మెల్లి

1313. రాముడంగీకరించి మునివరు నాశ్ర
మమున నిల్పె తన పరివారముల తోడ
సంతసించి భరద్వాజ తపసివరుడు
రామ పరివారములకు మన్ననల తోడ

1314. వారి వారి కిష్టమగు పదార్థములతొ
తృప్తులంజేసి రఘువంశ తిలకు రాము
దేవ మునివంద్యు విష్ణ్వంశ సంభవవుని
ధర్మ విగ్రహం నాశీర్వదించి వౌని

1315. దశరధాత్మజ సర్వ రాక్షసుల జంపి
లోక వాసుల రక్షించినావు నీకు
వరము నీయగ దలచితి గోరుమనగ
తాపసోత్తమ! కోసల దేశమందు

1316. చెట్లు లతలు నిరంతరము ఫల పుష్ప
భరితమై సమృద్ధిగ నుండునట్లు వరము
ను ప్రసాదింపుడన భరద్వాజ వౌని
కోసలాధీశు రాఘవు కోర్కె దీర్చె.

1317. రాముడంతట మారుతీ! ముందు నీవు
శృంగి బేరపురంబున మిత్రు గుహుని
జూచి నాకుశలము నందజేసి నచటి
నుండయోధ్యకు జని నందిగ్రామమందు

1318. భరతు గలసి నా యాగమనంబు జెప్పి
జనక జాపహరణము నుండి దశకంఠు
మరణము వరకన్ని విషయములను జెప్పి
భరతు హృదయము గ్రహియింపు మాంజనేయ

1319. గగన మార్గంబున హనుమ శృంగిబేర
పురమునుం జేరి గుహునికి రామచంద్రు
కుశలముం జెప్పి కోసలమందు నున్న
జనపదంబుల గోమతీ నదిని దాటి

1320. నంది గ్రామంబుజేరి భరతుని యాశ్ర
మంబునం దిగి నందన వనము బోలి
యున్న నతి ప్రశాంతము సాధుజన పరివృత
మైన యాశ్రమమున జూచె హనుమ భరతు

1321. నిరతమును రాఘవు ధ్యాన దీక్షనున్న
భరతు జూచిన హనుమ గ్రహించె నతని
హృదయమాప్రశాంత ప్రదేశమ్ము నందు
ధర్మతత్పరు భరతకుమారు హనుమ

1322. రాము పెద్దతమ్ము భరతు జేరి హనుమ
ఓ మహాత్మ! మీ యన్న శ్రీరామప్రభువు
క్షేమముగ నిట కేతెంచుచున్నవాడు
నన్ను బంపె ముందుగ వార్త తమకు దెల్ప

1322. భరతు హృదయ మానంద తరంగములను
తేలియాడుచు వివశమై కొంత వడికి
సమ్మదాశ్రులు నురమును దడుపుచుండ
హనుమ నతిప్రేమ నాలింగనమ్మొనర్చె

1324. హరివరేణ్య యింతటి శుభవార్త దెల్పి
నట్టి మిమ్మునెటుల సన్మానింతు లక్ష
గోవుల పవిత్ర హృదయలౌ కన్యకలను
పదియు నార్గుర నూరూళ్ళధార బోతు

1325. కపికులవరేణ్య యగ్రజునకును మీకు
నెప్పుడెట్లు సమాగమంబయ్యె ననగ
సర్వ వృత్తాంతమును వివరించె హనుమ
భరతుడత్యంత ముత్సాహవంతు డయ్యె

టంగుటూరి మహాలక్ష్మి