జక్కన్నగా సునీల్
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
కమెడియన్ నుండి హీరోగా మారిన సునీల్‌కు వచ్చిన వరుస అపజయాలతో కాస్త వెనుకపడ్డాడు. కాస్త బ్రేక్ తీసుకుని ఇప్పుడు ఏకంగా రెండు సినిమాల్లో నటిస్తున్నాడు. అందులో ఒకటి దిల్‌రాజు బ్యానర్లో చేస్తున్న కృష్ణాష్టమి సినిమా అయితే మరొక సినిమా వంశీ ఆకెళ్ళ దర్శకత్వంలో రూపొందుతుంది. ఈ సినిమాకు ఇప్పుడు టైటిల్ ఫిక్స్ చేసినట్టు తెలిసింది. టాలీవుడ్ సంచలన దర్శకుడు రాజవౌళి పేరు.. అదేనండి ఆయన్ను ముద్దుగా పిలిచే పేరును పెడుతున్నారట. ఆ పేరు ఏమిటంటే జక్కన్న. ముఖ్యంగా ఎన్టీఆర్ ఈ పేరుతో రాజవౌళిని బాగా పిలుస్తాడు. ఈ టైటిల్ అయితే అందరికీ బాగా తెలుసు కాబట్టి జక్కన్న టైటిల్ పెడితే సినిమాకు కూడా మంచి క్రేజ్ వస్తుందని ఈ టైటిల్‌కే ఫిక్స్ అయ్యేలా ఉన్నారు. సునీల్ సరసన మన్నారా హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమా జనవరిలో విడుదల కానుంది.