రాష్ట్రీయం

9 మంది మిలీషియా సభ్యుల లొంగుబాటు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, డిసెంబర్ 12: విశాఖ జిల్లా జికె వీధి మండలం పెదవలస గ్రామానికి చెందిన తొమ్మిది మంది మావోయిస్టు ఆర్మ్‌డ్ మిలీషియా సభ్యులు లొంగిపోయినట్టు జిల్లా ఎస్పీ కోయ ప్రవీణ్ చెప్పారు. శనివారం ఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ వీరు గతంలో పలు విధ్వంసాలకు పాల్పడ్డారని చెప్పారు. దాంతోపాటు రోడ్లకు అడ్డంగా చెట్లు నరికి పడేయడం, మావోల దుశ్చర్యలకు సహాయ సహకారాలు అందించేవారన్నారు. 2005లో పెదవలస గ్రామంలో గుర్తు తెలియని వ్యక్తిని హతమార్చిన సంఘటనలో వీరు సెంట్రీలుగా పనిచేశారన్నారు. అలాగే 2008లో చాపరాతిపాలెంలో జాంబు బాలరాజు ఇంటిపై కరవు దాడి చేశారని, 2013లో పెదవలసలో కాఫీ పల్పర్ యూనిట్‌ను ధ్వంసం చేశారని చెప్పారు. అదే ఏడాది సోమలింగం పడాల్, రాజు పడాల్ ఇళ్లపై కరవు దాడులకు పాల్పడ్డారని చెప్పారు. 2015లో పెదవలస పంచాయతీ చాపరాతిపాలెం వద్ద ఎపిఎఫ్‌డిసి కాఫీ తోటలను గిరిజనులకు పంపిణీ చేసిన సంఘటనలో వీరు గిరిజనులతో కలసి పంటను దొంగిలించారని పేర్కొన్నారు. లొంగిపోయిన వారిలో ఆర్మ్‌డ్ మిలీషియా కమాండర్లు కిల్లో గోపాలరావు, మర్రి రంగారావు, కొర్ర లస్సు, ఆర్మ్‌డ్ మిలీషియా మాజీ డిప్యూటి కమాండర్ కొర్ర సాంబ, మిలీషియా సభ్యుడు గుంట శ్రీను, కిల్లో భాస్కరరావు, పాంగి సత్తిబాబు, గుంట నాగేశ్వరరావు ఉన్నారన్నారు. అడిషనల్ ఎస్పీ కె.సత్యనారాయణ, పాడేరు ఎఎస్పీ ఎ.బాబూజీ, సిఆర్‌పిఎఫ్ డిప్యూటీ కమాండెంట్ సత్‌బీర్ సింగ్, డిప్యూటీ కమాండెంట్ పి.కిషోర్, డిఎస్సీ వైవి రమణ, సిఐ ఎ.వెంకటరావు తదితరులు పాల్గొన్నారు.