రాష్ట్రీయం

తెలంగాణ చల్లబడింది!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 26: వేసవికాలం ఆరంభంలోనే ఫిబ్రవరి నెలలో మండుటెండలు మొదలైనా, తెలంగాణలో శుక్రవారం ఒక్కసారిగా వాతావరణం చల్లబడింది. బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం కారణంగానే వాతావరణం చల్లబడిందని హైదరాబాద్‌లోని వాతావరణ పరిశోధనా కేంద్రం సంచాలకుడు నర్సింహారావు తెలిపారు. మహారాష్ట్ర, విదర్భ, తెలంగాణ రాష్ట్రం మీదుగా ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని ఆయన చెప్పారు. దీంతో ఆకాశం మేఘావృతమై పగటి ఉష్ణోగ్రతలు 2 డిగ్రీల వరకు తగ్గుతాయని ఆయన వివరించారు. ఉపరితల ఆవర్తనం కారణంగా కోస్తాంధ్రలో, తెలంగాణలో అక్కడక్కడ ఒక మోస్తరు నుంచి భారీ వర్షం కురిసే అవకాశం ఉందని ఆయన తెలిపారు. ఆదిలాబాద్ జిల్లాలో పలు చోట్ల వడగండ్లు పడ్డాయి. రెండు రోజులపాటు వాతావరణం చల్లగా ఉండే అవకాశం ఉంది.