ఆంధ్రప్రదేశ్‌

స్విస్ చాలెంజ్‌పై హైపవర్ కమిటీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, మే 6: రాజధాని అమరావతిని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు సింగపూర్ ప్రభుత్వం ఇచ్చిన ప్రతిపాదనలను పరిశీలించి, అందులో సాధ్యాసాధ్యాయలను అధ్యయనం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఒక హైపవర్ కమిటీని ఏర్పాటు చేసింది. ఈ మేరకు శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ కమిటీకి రాష్ట్ర ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు చైర్మన్‌గా వ్యవహరించనున్నారు. రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ, ఎంఎ అండ్ యుడి (సిఆర్‌డిఎ) ప్రిన్సిపల్ సెక్రటరీ అజయ్ జైన్, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి పివి రమేష్, ఆంధ్ర ప్రదేశ్ ప్లానింగ్ కౌన్సిల్ వైస్ చైర్మన్ కుటుంబరావు, క్యాపిటల్ సిటీ డవలప్‌మెంట్ అండ్ మేనేజ్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ సిఎండి డి లక్ష్మీ పార్థసారథి, సిఆర్‌డిఏ కమిషనర్ ఎన్ శ్రీకాంత్, ఎంఎ అండ్ యుడి నుంచి ప్రకాష్ గౌర్, చార్టర్డ్ అక్కౌంటెంట్ బిఎస్ చక్రవర్తి, శరత్ కుమార్ సభ్యులుగా ఉంటారు.