రాష్ట్రీయం

రోజాకు జిడిపి అంటే తెలుసా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

టిడిపి నేతల ఎద్దేవా
హైదరాబాద్, నవంబర్ 30: గ్రోత్ రేట్లగురించి, నీతి సూత్రాల గురించి వైకాపా నేతలు వల్లెవేయడం విచిత్రంగా ఉందని, అసలు ఆ పార్టీ నేత రోజాకు జిడిపి అంటే తెలుసా అంటూ టిడిపి ఎమ్మెల్సీ గాలి ముద్దుకృష్ణమనాయుడు నిలదీశారు. ప్రపంచంలో డబుల్ డిజిట్ గ్రోత్ ఉన్న దేశాలు ఏవీ లేవని వైకాపా నేతలు అంటున్నారని అది ఆంధ్రప్రదేశ్‌కు ఎలా సాధ్యమని ప్రశ్నించడం విచిత్రంగా ఉందని గాలి ముద్దుకృష్ణమనాయుడు అన్నారు. అవగాహనా రాహిత్యంతో వైకాపా నేతలు మాట్లాడుతున్నారని, సౌత్ సూడాన్, లియోన్, మంగోలియా, తుర్క్‌మెనిస్తాన్, టర్కీ వంటి దేశాలు డబుల్ డిజిట్ గ్రోత్ రేట్ ఉన్న దేశాలేనని గుర్తించాలని చెప్పారు. అధికారాన్ని అడ్డంపెట్టుకుని రికార్డు స్థాయిలో ఆస్తులను రెట్టింపుచేసుకోవడం , దొంగలెక్కలు, దొంగ అఫిడవిట్లు చూపించడం, బినామి కంపెనీలను ఏర్పాటు చేయడంలో వైకాపా నేతలు పిహెచ్‌డి చేశారని ఎద్దేవా చేశారు. వారికి అభివృద్ధి గురించి ఏం తెలుస్తుందని గాలి ముద్దుకృష్ణమ నాయుడు ప్రశ్నించారు.

అవాస్తవాల ప్రచారం మానుకోవాలి
వైకాపాకు మంత్రి అచ్చెన్నాయుడు హితవు
హైదరాబాద్, నవంబర్ 30: రాష్ట్ర ప్రభుత్వం పేదలకు అందిస్తున్న కిలో రూపాయి బియ్యం పథకంపై అబద్దపు ప్రచారాన్ని మానుకోవాలని ఎపి కార్మిక శాఖ మంత్రి అచ్చెన్నాయుడు వైకాపా నేతలకు హితవు పలికారు. ఏప్రిల్ నుంచి కోటాబియ్యం 4 కేజీల నుంచి 5 కేజీలకు పెంచిన విషయం, కుటుంబానికి 20 కేజీలుగా ఉన్న సీలింగ్‌ను ఎత్తివేసి తెల్లకార్డులో పేరు ఉన్న కుటుంబ సభ్యులందరికి కోటాను విస్తరించిన విషయాన్ని మరచి అవకాశవాద రాజకీయ విమర్శలు చేయడం సిగ్గుచేటని అన్నారు. వైఎస్ 9 గంటల విద్యుత్‌పై సంతకం చేసి ఆ హామీని అమలు చేయని సంగతి వైకాపా నేతలు మరచిపోయినట్లు ఉన్నారని అన్నారు. అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్లుగా పాలన సాగుతోందని అన్నారు. చంద్రబాబు తన పాలనలో 9 డిఎస్సీలు నిర్వహించి 1.70 లక్షల ఉపాధ్యాయ నియామకాలు చేపట్టారని గుర్తు చేశారు. ఆ విషయాలను మరచిపోయి చౌకబారు విమర్శలు చేయడం వైకాపా నేత పార్థసారథి మానుకోవాలని అన్నారు.