ఆంధ్రప్రదేశ్‌

చర్చిద్దామంటే వెనక్కెళతారా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వైకాపా తీరును నిలదీసిన టిడిపి
హైదరాబాద్, మార్చి 14: ఆంధ్రప్రదేశ్ మంత్రిమండలి ప్రజల్లో విశ్వాసాన్ని కోల్పోయిందంటూ అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టి, సమగ్రంగా చర్చించాలని పట్టుబట్టిన ప్రతిపక్ష వైఎస్‌ఆర్‌సిపి ఇప్పుడు చర్చకు అవకాశం ఇస్తే ఇంకా సమయం కావాలని కోరుతోందని తెలుగుదేశం పార్టీ చీఫ్ విప్ కాల్వ శ్రీనివాస్ అన్నారు. ప్రభుత్వం చర్చకు సిద్ధంగా ఉందని చెప్పగా, తమకు ఇంకా సమయం కావాలని, చర్చ నాలుగైదు రోజులు జరగాలని కోరడం వెనుక వైకాపా ఉద్దేశం ఏమిటని ఆయన ప్రశ్నించారు. సోమవారం బిఏసి సమావేశానంతరం శాసనసభ మీడియా పాయింట్ వద్ద కాల్వ శ్రీనివాస్ మాట్లాడారు. తీర్మానాన్ని ఎదుర్కొనేందుకు తమ ప్రభుత్వం సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు. శాసనసభలో స్పీకర్ అవిశ్వాస తీర్మానాన్ని పరిగణనలోకి తీసుకున్న తర్వాత వెంటనే సంప్రదాయం ప్రకారం బిఏసిలో చర్చించి ఎప్పుడు ఈ అంశంపై చర్చించేది నిర్ణయిస్తారని అన్నారు.