రాష్ట్రీయం

ముగ్గురు టీడీపీ సభ్యులు సస్పెన్షన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి: ముగ్గురు టీడీపీ సభ్యులను ఈరోజు సస్పెండ్ చేశారు. ఏపీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా ఈరోజు ఎస్సీ,ఎస్టీ, బీసీ మైనార్టీ మహిళలకు 45 ఏళ్లకే పింఛన్ సౌకర్యం కల్పించే విషయంలో ముగ్గురు టీడీపీ ఎమ్మెల్యేలు సస్పెన్షన్‌కు గురయ్యారు. ఎన్నికల హామీలపై ప్రభుత్వం స్పష్టతనివ్వాలని టీడీపీ సభ్యుడు రామానాయుడు డిమాండ్ చేశారు. ప్రభుత్వం ప్రదర్శించిన వీడియో క్లిప్పింగ్‌లు కాకుండా తమ వీడియో క్లిప్పింగుల ప్రదర్శనకు అనుమతినివ్వాలని పట్టుబట్టారు. ప్రభుత్వం నిరాకరించటంతో దీంతో టీడీపీ సభ్యులు అందోళనుకు దిగారు. దీనిపై ఆగ్రహించిన సభా వ్యవహారాల శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ ఈ సమావేశాలు ముగిసే వరకు టీడీపీ సభ్యులు అచ్చెన్నాయుడు, రామానాయుడు, బుచ్చయ్యచౌదరిలను సమావేశాల నుంచి సస్పెండ్ చేయాలని స్పీకర్‌కు ప్రతిపాదించారు. స్పీకర్ అంగీకరించటంతో ఆ ముగ్గుర్ని సస్పెండ్ చేశారు. వారు సభ నుంచి ఎంతకీ వెళ్లకపోవటంతో మార్షల్స్ సాయంతో బయటకు పంపారు.