రాష్ట్రీయం

మహిళా ఉపాధ్యాయుల జాతీయ ఫోరం ఆవిర్భావం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, నవంబర్ 23: జాతీయస్థాయిలో మహిళా ఉపాధ్యాయుల ఫోరం ఏర్పాటైంది. ఈ నెల 22, 23 తేదీల్లో హైదరాబాద్‌లో జరిగిన మహిళా ఉపాధ్యాయుల జాతీయ సమ్మేళనంలో జాతీయ ఫోరమ్‌ను ఏర్పాటు చేస్తూ నిర్ణయం తీసుకున్నట్లు టిఎస్‌యుటిఎఫ్ అధ్యక్షుడు ఎ.నర్సిరెడ్డి, ప్రధానకార్యదర్శి సిహెచ్.రవి ఒక ప్రకటనలో తెలిపారు. జాతీయ స్థాయి ఫోరమ్ కన్వీనర్‌గా తెలంగాణ నుంచి ఎం.సంయుక్త, జాయింట్ కన్వీనర్‌లుగా పి.డి.శ్రీదేవి (కేరళ), సీమాదత్త (బెంగాలీ), చారులతా మహాపాత్రో (ఒడిస్సా), కె.విజయగౌరి (ఎపి), సభ్యులుగా సిహెచ్.దుర్గ్భావానీ, ఎన్.సరళ, ఆర్.శారద (తెలంగాణ)లతో పాటు వివిధ రాష్ట్రాల నుంచి 22 మంది ఉపాధ్యాయినులు సభ్యులుగా ఎన్నికైనారు. జనవరి 3న సావిత్రిబాయి పూలే జయంతిని దేశ వ్యాప్తంగా అన్ని డివిజన్, తాలూకా కేంద్రాల్లో నిర్వహించాలని నిర్ణయించినట్లు తెలిపారు. మే నెలలో మహిళా ఉపాధ్యాయినుల జాతీయ స్థాయి వర్క్‌షాప్ నిర్వహించాలని ఫోరం నిర్ణయించిందని తెలిపారు.

విజిలెన్స్ ఎన్‌ఫోర్సుమెంట్ డిజి రిటైర్మెంట్ 30న
హైదరాబాద్, నవంబర్ 23: విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్సుమెంట్ డైరెక్టర్ జనరల్ టిపి దాస్ ఈ నెల 30వ తేదీన రిటైర్డ్ కాబోతున్నారు. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ సోమవారం జారీ చేసిన ఉత్తర్వులో పేర్కొన్నారు.