ఆంధ్రప్రదేశ్‌

ఎరువుల పంపిణీపై ‘టీమ్ కృష్ణా జిల్లా’ వినూత్న ప్రాజెక్టు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ స్థాయిలో అమలుకు ప్రధాని కార్యాలయం అనుమతి
ఢిల్లీలో ఎఇఎఫ్‌డిఎస్ ప్రాజెక్టు వివరాలు ప్రదర్శించిన కలెక్టర్ ఎ.బాబు
కలెక్టర్ బృందానికి అభినందనలు ప్రతి రాష్ట్రంలో ప్రాథమికంగా రెండు జిల్లాల ఎంపిక

విజయవాడ, మార్చి 13: ఎరువుల వినియోగంపై దృష్టి సారించడం ద్వారా సఫలీకృత, గ్రీన్ రివల్యూషనరీ విధానాలను సమర్థవంతంగా అమలు చేయడంలో కలెక్టర్ బాబు.ఎ ప్రతిపాదించిన ప్రాజెక్టును జాతీయ స్థాయిలో ఫెర్టిలైజర్స్ పంపిణీలో అమలుకు ప్రధాని కార్యాలయం అనుమతి లభించింది. ఈ ప్రాజెక్టు రూపకల్పనలో ‘టీం కృష్ణా జిల్లా’ పనితీరుకు అభినందనలు లభించాయి. కొత్త ఢిల్లీలోని ప్రధాని కార్యాలయంలో ఆదివారం మధ్యాహ్నం ఎఇఎఫ్‌డిఎస్ (ఆధార్ ఎనేబుల్డ్ ఫెర్టిలైజర్ డిస్ట్రిబ్యూషన్ సిస్టం) పేరిట రూపొందించిన ప్రాజెక్టు వివరాలను కలెక్టర్ బాబు.ఎ, తదితరులు ప్రదర్శించి చూపారు.
కేంద్ర కార్యదర్శి స్థాయి కమిటీ సభ్యులు, ఎరువుల శాఖ డైరెక్టర్ జనరల్, యుఎడిఎఐ ప్రధాన ఆర్థిక సలహాదారు, పిఎంవో జాయింట్ సెక్రటరీ ఆధ్వర్యంలో ఈ ప్రాజెక్టుపై చర్చించారు. తాము ప్రతిపాదించిన విధివిధానాలను ప్రతి రాష్ట్రంలో రెండు జిల్లాల్లో అమలుకు కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిందని, తదనంతరం దేశవ్యాప్తంగా పూర్తిస్థాయిలో ప్రతి ఎరువుల దుకాణానికి వ్యాప్తిచెయ్యాలని నిర్ణయించారని కలెక్టర్ బాబు.ఎ తెలిపారు. ఈ పథకం అమలుకు కేంద్ర ప్రభుత్వం నిధులను అందిస్తుందన్నారు. ‘టీం కృష్ణా జిల్లా’ ఈ పైలెట్ ప్రాజెక్టును ప్రతిష్ఠాత్మకంగా చేపట్టి సఫలీకృతమయ్యామని, త్వరలోనే గ్రామస్థాయి వరకు ఈ విధానాన్ని తీసుకెళతామని తెలిపారు. వాస్తవ ఫలితాలను రాబట్టేందుకు వెబ్‌ల్యాండ్, ఎల్‌ఇసి డేటా, ఆధార్ సీడింగ్, వెబ్‌ల్యాండ్‌లో తప్పులను సరిచేయటం, నూరుశాతం భూసార పరీక్షలు నిర్వహించడం, ఈ-పంట సమర్థవంతంగా చేపట్టడం ప్రాజెక్టు అమలులో కీలక అంశాలని ఆయన వివరించారు.
అంతకుముందు ఎరువులపై ఇచ్చే సబ్సిడీ వాస్తవ లబ్ధిదారులకు చేరేలా సాంకేతికతో రూపొందించిన ‘ఎఇఎఫ్‌డిఎస్’ ప్రాజెక్టు గురించి కేంద్ర బృందానికి వివరించినట్లు కలెక్టర్ బాబు.ఎ తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రారంభించిన ‘బాపు’ కార్యక్రమంలో భాగంగా ఫెర్టిలైజర్స్ వినియోగాన్ని క్రమబద్ధీకరించేందుకు నేషనల్ ఇన్ఫర్మేటిక్ కేంద్రం ద్వారా సాంకేతిక సహాయం తీసుకుంటారని తెలిపారు.
వాస్తవ విస్తీర్ణం, నీటి వనరులు, సాగుచేసే పంట అంశాలను దీనిద్వారా కచ్చితంగా గుర్తించే వీలుంటుందన్నారు. ఈ విధానంలో భాగంగా ఎరువుల దుకాణాల నుంచి ఎరువులు కొనే వ్యక్తి ఆధార్ సంఖ్యను తప్పనిసరిగా నమోదు చేస్తారని తెలిపారు.
తొలుత కృష్ణా జిల్లాలో పైలెట్ ప్రాజెక్టుగా 20 ఎరువుల దుకాణాల్లో ఈ నెల 8న ప్రారంభించామని, దీనిద్వారా ఎరువులు తీసుకెళుతున్న వారి వివరాలను గుర్తించామన్నారు. వాస్తవంగా ఆయా వ్యక్తులు ఎంత మొత్తం భూములు సాగుచేస్తున్నారు, వారు తీసుకెళ్లిన ఎరువులు ఏ పంట సాగుకు వినియోగిస్తున్నారు, ఆప్రాంతంలో వినియోగించిన ఎరువులు, భూసార ధాతువుల ఆధారంగా విశే్లషించుకునే అవకాశం లభిస్తుందన్నారు. ఎరువుల విక్రయాలను జిల్లాలో ఎఇఎఫ్‌డిఎస్ విధానంలో చేపట్టడానికి పైలెట్‌గా యూనిట్ల (ఎలక్ట్రానిక్ పాయింట్ ఆఫ్ సేల్) కొనుగోలు, ఇంటర్నెట్ కనెక్షన్ కోసం రూ.3.22 కోట్ల మేరకు నిధులు అవసరం అవుతాయని ప్రాథమిక ప్రతిపాదనల ద్వారా కలెక్టర్ బాబు.ఎ వివరించారు. ఈ సమావేశంలో ఉత్తరప్రదేశ్ వ్యవసాయ శాఖ ముఖ్య కార్యదర్శి అమిత్ మోహన్, ఎన్‌ఐసి, ఇతర ఉన్నత స్థాయి అధికారులు, బృందం సభ్యులు పాల్గొన్నారు.