రాష్ట్రీయం

రెప్పపాటు కూడా కోతల్లేవు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వీడ్కోలు - 2015:తెలంగాణ - విద్యుత్ రంగం
తెలంగాణ రాష్ట్రం అవతరించిన తర్వాత వ్యవసాయానికి విద్యుత్ సమస్య లేకపోవడం విశేషం. ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు సమయానుకూలంగా తీసుకున్న చర్యల వల్ల 2015 వేసవిలో విద్యుత్ కోతలు లేవు. పరిశ్రమలకు నిరంతరం విద్యుత్ సరఫరా అవుతోంది. వ్యవసాయానికి ఏడు గంటల విద్యుత్ అవాంతరం లేకుండా సరఫరా చేస్తున్నారు. అలాగే దేశంలోనే అత్యుత్తమైన సౌర విద్యుత్ విధానాన్ని ప్రభుత్వం ప్రకటించింది. విద్యుత్ రంగంలో ఉన్నత ప్రమాణాలను సాధించినందుకు, నాణ్యమైన విద్యుత్ సరఫరా చేసినందుకు తెలంగాణ సదరన్ పవర్ డిస్కాంకు ప్రతిష్టాకరమైన అవార్డు లభించడం విశేషం.
============
తెలంగాణ రాష్ట్రం అవతరించినప్పుడు విద్యుత్ రంగంలో సంక్షోభం ఎదుర్కొంటుందని స్పెక్యులేషన్ చేసిన నిపుణుల అంచనాలు తలకిందులయ్యాయి. విద్యుత్ కోతల పరిస్ధితిని అధిగమించి మిగులు విద్యుత్ రాష్ట్రంగా 2018 నాటికి తెలంగాణ అవతరించబోతోంది. ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు దార్శనికత, చొరవ, సమయానుకూలంగా తీసుకున్న చర్యల వల్ల 2015 వేసవిలో విద్యుత్ కోతలు లేవు. పరిశ్రమలకు నిరంతరం విద్యుత్ సరఫరా అవుతోంది. వ్యవసాయానికి ఏడు గంటల విద్యుత్ అవాంతరం లేకుండా సరఫరా చేస్తున్నారు. గతంలో అసెంబ్లీ సమావేశాల్లో ఎమ్మెల్యేలు ఎండిన పైర్లను పట్టుకొచ్చి ప్రదర్శించే వారు. తెలంగాణ రాష్ట్రం అవతరించిన తర్వాత వ్యవసాయానికి విద్యుత్ సమస్య లేకపోవడం విశేషం. ప్రస్తుతం తెలంగాణలో ఈ ఏడాది అక్టోబర్ నాటికి మొత్తం అందుబాటులో ఉన్న విద్యుత్ 9376.33 మెగావాట్లు. ఈ ఏడాది కొత్తగా 80 మెగావాట్ల జల విద్యుత్, ఎన్‌టిపిఎల్‌లో 77.82 మెగావాట్లు, లాంగ్ టర్మ్ ఒఏ కింద 269..45 మెగావాట్లు కలిపి 505.09 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి అందుబాటులోకి వచ్చింది. ప్రస్తుతం తెలంగాణలో జెన్కో పరిధిలో 4893.60 మెగావాట్ల థర్మల్, జల, విద్యుత్ ఉత్పత్తి అవుతోంది. తెలంగాణ రాష్ట్రంలో 2018 నాటికి 24వేల మెగావాట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. విద్యుత్ రంగంలో వచ్చే మూడు నుంచి నాలుగు సంవత్సరాల్లో ఒక లక్ష కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టేందుకు రాష్ట్రప్రభుత్వం ప్రణాళికను ఖరారు చేసింది.
తెలంగాణ ప్రభుత్వం మణుగూరులో 1080 మెగావాట్లు, కొత్తగూడెంలో 800 మెగావాట్లు, దామరచర్లలో 4000 మెగావాట్ల థర్మల్ ప్లాంట్లను నెలకొల్పేందుకు శ్రీకారం చుట్టింది. దీనికి సంబంధించిన నిర్మాణం పనులు వేగవంతమవుతున్నాయి. ఈ ప్రాజెక్టులు వచ్చే మూడేళ్లలో నిర్మాణం పూర్తి చేసుకుంటాయి. పవర్ ఫైనాన్స్ కార్పోరేషన్, ఆర్‌ఇసి రూ.30,232 కోట్ల నిధులను అందచేస్తున్నాయి. వరంగల్ జిల్లా భూపాలపల్లిలో 600 మెగావాట్లు, ఆదిలాబాద్ జిల్లా సింగరేణి థర్మల్ ప్లాంట్ 600 మెగావాట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేసేందుకు సిద్ధమయ్యాయి. వచ్చే రెండు నెలల్లో ఈ రెండు ప్లాంట్లు వాణిజ్య ఉత్పత్తిని ప్రారంభించనున్నాయి. రాష్ట్ర విభజన సందర్భంగా కేంద్రం ఇచ్చిన మాట ప్రకారం రామగుండంలో నాలుగువేల మెగావాట్ల థర్మల్ ప్లాంట్ నిర్మాణానికి ఎన్టీపిసి సన్నాహాలు చేపట్టింది. ఇప్పటికే పర్యావరణ అనుమతులు వచ్చాయి. భూ సేకరణ పూర్తయింది. ఈ ప్రాజెక్టును 9500 కోట్ల రూపాయల వ్యయంతో చేపట్టనున్నారు. సింగరేణి కాలరీస్‌తో 70 శాతం బొగ్గు లింకేజి ఖరారైంది. మరో 30 శాతం బొగ్గును దిగుమతి చేసుకుంటారు.ఎన్టీపిసికి 45 వేల మెట్రిక్ టన్నుల బొగ్గు సరఫరా చేసేందుకు సింగరేణి అంగీకరించింది. తెలంగాణ ప్రభుత్వం శ్రీపాద యల్లంపల్లి రిజర్వాయర్ నుంచి రెండు టిఎంసిల నీటిని ఎన్టీపిసికి కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. తెలంగాణలో ఆరు వేల మెగావాట్ల థర్మల్ విద్యుత్ ప్లాంట్ల నిర్మాణానికి టిఎస్ జెన్కో బిహెచ్‌ఇఎల్‌తో అవగాహన ఒప్పందాన్ని ఖరారు చేసింది. నల్లగొండ జిల్లా దామరచర్లలో నిర్మించ తలపెట్టిన నాలుగువేల మెగావాట్ల విద్యుత్ ప్లాంట్‌కు యాదాద్రి థర్మల్ పవర్ ప్రాజెక్టుగా నామకరణం చేశారు. తెలంగాణలో తొలి సూపర్‌క్రిటికల్ థర్మల్ పవర్ ప్రాజెక్టు ఇది. బిహెచ్‌ఇఎల్‌కు ఈ ప్లాంట్ నిర్మాణానికి సంబంధించి ఇంజనీరింగ్, ప్రొక్యూర్‌మెంట్, కన్‌స్రక్షన్ (ఇపిసి) ఆధారంగా పనులను అప్పగించారు. తెలంగాణ ప్రభుత్వం విద్యుత్ కోతలు తలెత్తకుండా, మిగులు విద్యుత్ సాధించేందుకు ప్రైవేట్ విద్యుత్ సంస్ధల నుంచి విద్యుత్ కొనుగోలుకు ఎంఓయూలు ఖరారు చేసింది. చత్తీస్‌గడ్ నుంచి వెయ్యి మెగావాట్ల విద్యుత్ తెచ్చేందుకు ట్రాన్స్‌మిషన్ లైన్ల నిర్మాణం పనులు జరుగుతున్నాయి. తెలంగాణలో థర్మల్ విద్యుత్ ప్లాంట్లు ప్లాంట్ లోడ్ ఫ్యాక్టర్ (పిఎల్‌ఎఫ్)ను 80 శాతంపైన సాధించి రికార్డు నెలకొల్పాయి. తెలంగాణ ప్రభుత్వం ఈ ఏడాది దేశంలోనే అత్యుత్తమైన సౌర విద్యుత్ విధానాన్ని ప్రకటించింది. వచ్చే ఐదేళ్ల వరకు ఈ విధానం అమలులో ఉంటుంది. ఈ విధానంలో సోలార్ డెవలపర్లకు అనేక ప్రోత్సాహకాలను ప్రకటించారు. ఈ విధానం అమలుకు సోలార్ పాలసీ సెల్‌ను ఏర్పాటు చేశారు. సౌర విద్యుత్ ప్రాజెక్టుల అమలుకు ఏడుగురు విద్యుత్ నిపుణులతో ఉన్నతాధికార కమిటీని ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు. విద్యుత్ రంగంలో ఉన్నత ప్రమాణాలను సాధించినందుకు, నాణ్యమైన విద్యుత్ సరఫరా చేసినందుకు తెలంగాణ సదరన్ పవర్ డిస్కాం సిఎండి రఘుమా రెడ్డికి ప్రతిష్టాకరమైన అవార్డు లభించడం విశేషం.

- శైలేంద్ర