రాష్ట్రీయం

యుద్ధ ప్రాతిపదికన.. రహదారుల పనులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాప్యం చేసే కాంట్రాక్టర్లకు నోటీసులు.. తదుపరి చర్యలు
ఆదిలాబాద్ జిల్లా అధికారులను ఆదేశించిన తెలంగాణ మంత్రులు

హైదరాబాద్, డిసెంబర్ 4: ఆదిలాబాద్ జిల్లాలో యుద్ధ ప్రాతిపదికన రోడ్ల పనులు చేపట్టాలని మంత్రులు అధికారులను ఆదేశించారు. ఆదిలాబాద్ రహదారుల పరిస్థితిపై సచివాలయంలో శుక్రవారం ఉన్నత స్థాయి సమీక్ష జరిగింది. పంచాయితీరాజ్ శాఖ మంత్రి కె తారక రామారావు, రోడ్లు భవనాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, గృహ నిర్మాణ శాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి, అటవీ శాఖ మంత్రి జోగు రామన్న, ఆదిలాబాద్ జిల్లా ఎమ్మెల్యేలు అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. జిల్లాల పర్యటనకు వెళ్లడానికి ముందు కెసిఆర్ ఆయా జిల్లాల సమస్యపై ప్రజాప్రతినిధులతో సమావేశాలు జరపాలని నిర్ణయించారు.
దీనిలో భాగంగా ఆదిలాబాద్ నేతలతో చర్చించారు. తూర్పు ఆదిలాబాద్ ప్రాంతంపై మంత్రులు, అధికారులు ప్రత్యేక శ్రద్ధ చూపించి అభివృద్ధి కార్యక్రమాలు అమలు జరిగేలా చూడాలని ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌రావు ఆదేశించిన నేపథ్యంలో మంత్రులు సమీక్షించారు. ఆదిలాబాద్ జిల్లాలో యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాల్సిన రోడ్ల వివరాలను అడిగి తెలుసుకున్నారు. జిల్లా నుంచి మండల కేంద్రాలకు రోడ్లు లేని వాటిపై దృష్టి సారించాలని పంచాయితీరాజ్ శాఖ మంత్రి కెటిఆర్ అధికారులను ఆదేశించారు. నిధులు మంజూరైన వెంటనే పనులు ప్రారంభించాలని ముఖ్యమంత్రి త్వరలోనే జిల్లాలో పర్యటిస్తారని తెలిపారు. పనులు చేపట్టడంలో కాంట్రాక్టర్లు జాప్యం చేస్తున్నారని ఎమ్మెల్యేలు తెలపగా, అలాంటి కాంట్రాక్టర్లకు నోటీసులు జారీ చేసి అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
పనుల నత్తనడకను సహించేది లేదని అన్నారు. ఆసిఫాబాద్, చెన్నూరు, బెల్లంపల్లి, మంచిర్యాల, సిర్పూర్ నియోజక వర్గాల్లో రోడ్ల నిర్మాణానికి ఆటవీ శాఖ నుంచి వస్తున్న సమస్యలను సమావేశంలో వివరించారు. పాత రోడ్ల విషయంలో అటవీ శాఖ అధికారులు అడ్డు తగలరాదని, ఎవరైనా అలా చేస్తే తమ దృష్టికి తీసుకు రావాలని తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. అటవీ ప్రాంతంలో రోడ్లు వేసేప్పుడు వివరాలు తమ శాఖ అధికారులకు ఇస్తే వెంటనే అనుమతి ఇస్తామని అటవీ శాఖ మంత్రి జోగు రామన్న తెలిపారు. ముఖ్యమంత్రి జిల్లా పర్యటనకు వచ్చేనాటికి అధికారులు, ఆర్ అండ్ బి పంచాయితీ రాజ్ శాఖల మధ్య సమన్వయం ఉండాలని అన్నారు. ఒకటి రెండు రోజుల్లో దీనిపై ఉమ్మడి సమావేశం నిర్వహించనున్నట్టు చెప్పారు.