టాలీవుడ్ సైతం..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రకృతి బీభత్సానికి చెన్నై నగరం అతలాకుతలమైంది. అకాల వర్షాల కారణంగా మద్రాసు నీట మునిగిపోయింది. అనేకమంది ప్రజలు నిరాశ్రయులయ్యారు. ప్రాథమిక అవసరాల కోసం ఆర్తిగా ఎదురుచూస్తున్నారు. తోటి మనిషి కష్టంలో వున్నపుడు ఓ మనిషిగా అండగా నిలబడాలన్న కోరికతో తెలుగు సినిమా పరిశ్రమలో హీరోలు, హీరోయిన్లతోపాటు ప్రముఖులంతా కలిసి తామున్నామన్న భరోసా ఇచ్చే ప్రయత్నం చేస్తామంటున్నారు. ప్రజలను కూడా ఇందులో భాగస్వాములను చేయడానికి పలు ప్రాంతాలను సందర్శించి విరాళాలను సేకరించనున్నారు. అల్లరి నరేష్, నాని, నిఖిల్, నవదీప్, అల్లు శిరీష్, మనోజ్, రానా, మంచు లక్ష్మి, మధుశాలిని, తేజస్విని తదితరులు ‘మన మద్రాసు కోసం’ అన్న కార్యక్రమాన్ని రూపొందిస్తున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా పదిమంది హీరో హీరోయిన్లు ఈనెల 6 అనగా ఆదివారం సాయంత్రం 4 గంటలనుండి 7 గంటల వరకు హైదరాబాద్‌లోని పలు ప్రాంతాలను సందర్శించి అక్కడి ప్రజలనుండి విరాళాలను సేకరించనున్నారు. సేకరించిన మొత్తాన్ని చెన్నై బాధితులకు చేరేలా కార్యాచరణ రూపొందించామని, ఎవరైనా తమ విరాళాలను పంపవచ్చని వారు తెలిపారు.
రకుల్ కూడా..
చెన్నై వాసులకు తెలుగు కథానాయికలు ఆసరాగా నిలుస్తున్న సంగతి తెలిసిందే. కొంతమంది ఆర్థికంగా ఆదుకుంటూండగా మరికొంతమంది వారికి అత్యవసరమైన నీరు, బిస్కెట్ ప్యాకెట్లు వంటి ఆహార పదార్థాలను చెన్నైకి పంపిస్తూ తమకు వీలైనంత సహాయం చేస్తున్నారు. ఈ జాబితాలో రకుల్‌ప్రీత్‌సింగ్ కూడా చేరింది. తన వంతు సాయంగా 5వేలమందికి సరిపడా ఆహార పదార్థాలతోపాటు మంచినీటిని అందిస్తోంది. తనను ఆదరించిన ప్రేక్షక దేవుళ్లకు ఈ విధంగా సహాయం అందించే అవకాశం లభించడం అదృష్టంగా తాను భావిస్తున్నాని రకుల్ ప్రీత్‌సింగ్ వ్యాఖ్యానించింది.
విశాల్ విశాల హృదయం
చెన్నైలో పలు ప్రాంతాలు జలమయమైన నేపథ్యంలో తెలుగు, తమిళ హీరో విశాల్ నీళ్ళల్లో కలియతిరుగుతూ ఆర్తులను ఆదుకుంటున్నారు. నిన్న సంగీత దర్శకుడు ఇళయరాజా వికలాంగుల పాఠశాలకు నీళ్ళల్లోనే నడుచుకుంటూ వెళ్లి వారికి అవసరమైన ఆహార పొట్లాలు, మంచినీటి ప్యాకెట్లను అందించిన సంగతి తెలిసిందే. నేడు హీరో విశాల్ కూడా తన సహచరులతో కలిసి పలు ప్రాంతాలలో నీళ్ళల్లో నడుచుకుంటూ తాను తీసుకువచ్చిన ఆహార పొట్లాలను, మంచినీటి ప్యాకెట్లను అందించారు. పలువురు సినీ పరిశ్రమకు చెందిన దాతలు ఈ సందర్భంగా ఒక్కొక్కరు సాయం చేయడానికి ముందుకు వస్తుండడం విశేషం.