రాష్ట్రీయం

పోలీసు కమాండ్ కంట్రోల్‌రూంకు నేడు కెసిఆర్ శంకుస్థాపన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బంజారాహిల్స్‌లో 8ఎకరాల్లో నిర్మాణం అత్యాధునిక టెక్నాలజీతో రెండు టవర్లు
హైదరాబాద్, నవంబర్ 21: రాజధానిలో నేరాల అదుపునకు అత్యాధునిక టెక్నాలజీతో ఏర్పాటు చేయనున్న పోలీసు కమాండ్ కంట్రోల్ రూమ్‌కు ను ఆదివారం ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌రావుశంకుస్థాపన చేయనున్నారు. బంజారాహిల్స్‌లో ఎనిమిది ఎకరాల స్థలంలో రూ. 500కోట్ల వ్యయంతో నిర్మించతలపెట్టిన సిసిసిను రెండు టవర్లుగా 16అంతస్తులు, 24అంతస్తులుగా ఏర్పాటు చేయనున్నారు. ఇందుకు సంబంధించి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మ, డిజిపి అనురాగ్ శర్మ, నగర పోలీసు కమిషనర్ మహేందర్‌రెడ్డి డిజైన్‌కు తుది మెరుగులు దిద్దారు. ఆదివారం ఉదయం జరిగే శంకుస్థాపన కార్యక్రమానికి ముఖ్యమంత్రితో పాటు ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ, కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ, హోం మంత్రి నాయిని నర్సింహరెడ్డి, మంత్రులు టి పద్మారావుగౌడ్, తలసాని శ్రీనివాస్ యాదవ్ తదితరులు హాజరుకానున్నారు.
** కమాండ్ కంట్రోల్‌రూం నమూనా **