రాష్ట్రీయం

నిరుద్యోగ యువతకు శిక్షణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఏపి బ్యాంకర్ల గ్రామీణ, ఔత్సాహికుల అభివృద్ధి సంస్థ వెల్లడి
హైదరాబాద్, నవంబర్ 30: ఆంధ్రప్రదేశ్, తెలంగాణా రాష్ట్రాల్లోని నిరుద్యోగ యువతకు వివిధ కోర్సుల్లో స్వల్పకాలిక శిక్షణ ఇవ్వనున్నట్లు ఆంధ్రప్రదేశ్ బ్యాంకర్ల గ్రామీణ, ఔత్సాహికుల అభివృద్ధి సంస్థ ప్రకటించింది. డిసెంబర్ 12 నుంచి ఫిబ్రవరి 2 వరకు ఈ శిక్షణ ఇస్తున్నట్లు తెలిపింది. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో అర్హులైన నిరుద్యోగ యువకులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరింది. 18 నుంచి 30 ఏళ్ల వయస్సు ఉన్న వారు ఈ కోర్సులు చేరేందుకు అర్హులుగా తెలిపింది. ఇంటర్, ఆపైన చదివిన వారు ఎంఎస్ ఆఫీస్ కోర్సు, పిసి హార్డ్ వేర్ కోర్సుల్లో చేరేందుకు అర్హులని ఔత్సాహికుల అభివృద్ధి సంస్థ ప్రకటించింది.
ల్యాప్‌టాప్ సర్వీసింగ్ కోర్సునకు ఇంటర్‌పాసై, పిసిహార్డ్ వేర్ పూర్తి చేసిన వారు అర్హులు కాగా, డొమెస్టిక్ ఎలక్ట్రీషియన్, వ్యవసాయ పంప్‌సెట్ మరమ్మత్తు కోర్సులో చేరేందుకు ఎస్‌ఎస్‌సి ఉత్తీర్ణులైనా, ఫెయిలైనా సరే అర్హులని స్పష్టం చేసింది. ఇప్పటి వరకు తమ సంస్థలో దాదాపు 10717 మంది యువత శిక్షణ తీసుకుని ఉపాధి పొందారని తెలిపారు. ఈ శిక్షణ పూర్తిగా పురుషులకు మాత్రమేనని స్పష్టం చేసింది.
కాగా ప్రస్తుతం చదువుతున్న వారు, ఇదివరకే శిక్షణ పొందినవారు, ఇంజినీరింగ్, ఎంబిఏ, ఎంసిఏ చదివిన వారు ఈ శిక్షణ పొందేందుకు అర్హులు కారని సంస్థ ఒక ప్రకటనలో వివరణ ఇచ్చింది. అర్హులైన అభ్యర్థులను వాణిజ్య బ్యాంకుల జనరల్ మేనేజర్లు, గ్రామీణ బ్యాంకుల చైర్మన్లు, సహకార బ్యాంకుల సిఇఓలు, మహిళా శిశు సంక్షేమ శాఖ కమిషనర్లు, పిఆర్‌అండ్‌ఆర్‌డి కమిషనర్లు, నాబార్డు డిజిఎంలు, ఎజిఎంలు, డిఆర్‌డిఏ, ఐటిడిఏ పివోలు, ఎన్‌జివోలు ఎంపిక చేసిన వారి జాబితాను తమకు పంపించి సహకరించాలని ఔత్సాహికుల అభివృద్ధి సంస్థ తెలిపింది.