ఇలా అయితే ఎలా?
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
అసలే అవకాశాలు లేవు. దానికితోడు ఏ ప్రమోషన్‌కు రాను అంటే ఊరుకుంటారా? డబ్బులు పెట్టిన నిర్మాత పరిస్థితి కూడా చూడాలి కదా! ఇవన్నీ పట్టించుకోకపోవడంవల్ల, సినిమాలు ఢమాల్‌మని పేలిపోవడంవల్ల త్రిషకు అవకాశాలు తగ్గుతున్నాయి. దాదాపు ఈ సంవత్సరంలో ఆమె నటించిన చిత్రం మరొకటి రాకపోవచ్చు. అయితే ‘నాయకి’ అనే హారర్ చిత్రంలో ప్రస్తుతం త్రిష నటిస్తోంది. ఈ చిత్రం తమిళ, తెలుగు భాషల్లో రూపొందిస్తున్నారు. అంతా బానే వుంది కానీ ఈ చిత్రం వచ్చే జనవరికి విడుదల చేయనున్నారని త్రిష చెబుతోంది. అయితే ఈ చిత్రానికైనా ఆమె ప్రమోషన్‌కు వస్తుందా అంటే అనుమానమే అని చిత్ర యూనిట్ చెబుతోంది. ఈ సినిమా ప్రమోషన్‌కి రాకపోతే ఆ చిత్ర విజయం అటూ ఇటూ అయితే మాత్రం త్రిషని రక్షించేవారెవరూ లేరంటూ కోలీవుడ్‌లో హల్‌చల్ చేస్తున్నారు మీడియా ప్రతినిధులు.