తెరపై వెలగాలని..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్న ‘ఏ మంత్రం వేశావే’ సినిమాతో హీరోయిన్‌గా తెలుగు తెరకు పరిచయమవుతోంది శివానీ సింగ్. గోలీసోడా ఫిలిం పతాకంపై సుర ఎంటర్‌టైన్‌మెంట్ సమర్పణలో శ్రీ్ధర్ మర్రి స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం శుక్రవారం విడుదలవుతున్న సందర్భంగా హీరోయిన్ శివానీ చెప్పిన విశేషాలు... నేను ఢిల్లీ అమ్మాయిని. అమ్మ టీచర్, నాన్న ఏరోనాటిక్ ఇంజనీర్. సింపుల్ ఫ్యామిలీ. నేను గ్రాడ్యుయేషన్ పూర్తిచేసి మోడలింగ్‌లో అడుగుపెట్టాను. చాలా బ్రాండ్లకు ప్రచారకర్తగా వ్యవహరించాను. ప్రస్తుతం రియాలిటీ షోలకు వ్యాఖ్యాతగా చేస్తున్నాను. రంగస్థలం కళాకారిణిగా చేసిన అనుభవం వుంది. సినిమాలపై ఆసక్తితోనే ముంబైలో అడుగుపెట్టాను. హీరోయిన్‌గా తెరపై నన్ను నేను చూసుకోవాలన్నదే నా కల. అది ఈ సినిమాతో నెరవేరబోతోంది. ఈ సినిమాకోసం నన్ను సంప్రదించారు. ఇందులో నవతరం అమ్మాయిలకు ప్రతీకగా ధైర్యం, తెలివితేటలు వున్న అమ్మాయిగా కన్పిస్తాను. నా పాత్రలోని భావోద్వేగాలు ప్రతి ఒక్కరికీ కనెక్ట్ అవుతాయ. విజయ్‌తో నటించడం చాలా సరదాగా సాగింది. తను మంచి పాషన్ వున్న నటుడు. తెలుగు రాకపోయినా టీమ్ చాలా సపోర్టు అందించారు. ఇంగ్లీషులో డైలాగులు రాసుకుని ప్రాక్టీసు చేశాను. నిజానికి 2014లో ఈ చిత్రాన్ని అంగీకరించాను. 15లో షూటింగ్ జరిగింది. మంచి కథతో ప్రస్తుతం వున్న యూత్‌ని టార్గెట్ చేస్తూ తెరకెక్కిన సినిమా ఇది. ఆధునిక యుగంలో సాంకేతికతపై ఎక్కువగా ఆధారపడకూడదని, దానికి బానిసలు కాకూడదని ఈ సినిమాలో చెబుతున్నారు. తెలుగులో మహేష్‌బాబు అంటే చాలా ఇష్టం. చిత్ర పరిశ్రమలోనే కాకుండా మహిళలు అన్ని రంగాల్లో ముందుండాలి. ముఖ్యంగా అన్యాయాలు, అఘాయిత్యాలను ఎదుర్కొనే ధైర్యం మహిళలకు రావాలి. ఇక హిందీలో హృతిక్ రోషన్, అక్షయ్‌కుమార్‌లంటే ఇష్టం. ప్రస్తుతం ఓ కొత్త సినిమాకు సంబంధించి చర్చలు జరుగుతున్నాయి అంటూ ముగించారు.