రాష్ట్రీయం

బ్లాక్ మనీని వైట్ చేస్తామంటూ మోసం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మే 14: హైదరాబాద్ నగరంలో రోజురోజుకూ నేరాలు, ఘోరాలు పెరిగిపోతున్నాయి. తాజాగా శనివారం పంజగుట్ట పోలీసు స్టేషన్ పరిధిలో బ్లాక్ మనీని వైట్ చేస్తామంటూ దృష్టి మరల్చి మోసాలకు పాల్పడుతున్న ఏడుగురు అంతర్రాష్ట ముఠాను వెస్ట్‌జోన్ పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి రూ. 33 లక్షల నగదుతోపాటు రెండు కార్లు, రెండు మ్యాజిక్ సూట్‌కేసులు, పేపర్ నోట్ల బండిల్స్, సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాల్లోని పలు పోలీస్ స్టేషన్లలో వీరిపై దొంగతనాల కేసులు నమోదై ఉన్నట్టు పోలీసులు తెలిపారు. విశాఖపట్నంకు చెందిన కె కనకరాజు, కాకినాడుకు చెందిన అంబటి సంతోష్‌కుమార్, కోల్‌కతాకు చెందిన అట్టాడ సీతారాం కలసి ఒక ముఠాగా ఏర్పడ్డారు. 2005కు ముందు నాటి కరెన్సీని మార్పించుకోవాలని ఇటీవల ఆర్‌బిఐ ప్రకటించి నేపథ్యంలో వీరు రెండు బ్యాగుల్లో నకిలీ కరెన్సీని పెట్టుకొని బ్లాక్ మనీని వైట్ చేస్తామంటూ షాపింగ్ మాల్స్ వద్ద సంపన్నులకు గాలం వేస్తారు. కరెన్సీని ఎక్స్‌చేంజ్ చేస్తామని నమ్మబలుకుతారు. వారి నుంచి తీసుకున్న కరెన్సీని రెండు పోర్షన్లు కలిగిన ఓ బ్యాగ్‌లో వేస్తారు. అదే బ్యాగ్‌లో రెండో పోర్షన్‌లో ఉన్న కరెన్సీని లెక్కించి చూపుతారు. అసలు కరెన్సీని తీసుకొని వైట్ బండిల్స్ పెట్టిన బ్యాగ్‌ను లాక్ చేస్తారు. వెంటనే అక్కడి నుంచి జారుకుంటారు. పంజగుట్ట పిఎస్ పరిధిలో పది లక్షలు, దుండిగల్ పిఎస్ పరిధిలో రూ. 3లక్షల 50 వేలు ఎక్సేంజ్ కరెన్సీని స్వాధీనం చేసుకున్నారు. మరో అంతర్రాష్ట ముఠాకు చెందిన నలుగురిని అరెస్టు చేసినట్టు వెస్ట్‌జోన్ పోలీసులు తెలిపారు. తూర్పుగోదావరికి చెందిన ఎర్రోతు నాగేశ్వరరావు, హిందూపూర్‌కు చెందిన రవీందర్ రెడ్డి, చిత్తూరు జిల్లాకు చెందిన షేక్ హైదర్ వలి, బిజినేపల్లికి చెందిన తిమ్మిశెట్టి హేమంత్‌కుమార్ అరెస్టయిన వారిలో ఉన్నారు. వీరి నుంచి రూ. 19.50 లక్షలు స్వాధీనం చేసుకొని రిమాండ్‌కు తరలించారు.