రాష్ట్రీయం

నీళ్లలో నిప్పు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముదురుపాకాన కృష్ణా జలాల వివాదం
నీటి విడుదలలో కృష్ణా బోర్డు జోక్యం
సాగర్‌నుంచి 1.4 టిఎంసి విడుదలకు ఆదేశం
ఉద్దేశపూర్వకంగానే ఆర్డీఎస్ పనులకు అడ్డు
పనులు ఆపేయాలని కర్నాటకకు ఏపి లేఖ
వైఖరి మారకపోతే పులిచింతలకు ఇబ్బందులు
ఏపి సర్కార్‌పై తెలంగాణ మంత్రి హరీశ్ ధ్వజం
ఆరోపణలు అవాస్తవమన్న ఏపి మంత్రి దేవినేని

ఆర్డీఎస్ ఆధునీకరణ పనుల్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా అడ్డుకుంటోంది. తెలంగాణ ఎగువ రాష్ట్రం. ఆంధ్ర ఇలానే ఇబ్బందులు పెట్టాలని చూస్తే నష్టపోయేది వాళ్లే. రాజోలిబండ పనులను అడ్డుకుంటే ఆంధ్రకు అతిముఖ్యమైన పులిచింతలకు ఇబ్బందులు తప్పవు.

హైదరాబాద్/ విజయవాడ, మే 17: తెలుగు రాష్ట్రాల మధ్య కృష్ణా జలాల వివాదం ముదురుపాకాన పడుతోంది. ఓవైపు తొమ్మిది టిఎంసిల నీటి విడుదల, మరోవైపు రాజోలిబండ ప్రాజెక్టు ఆధునీకరణ పనుల వివాదం రెండు రాష్ట్రాల మధ్య చిచ్చు రాజేస్తున్నాయి. డెల్టా ప్రాంతానికి ఇవ్వాల్సిన ఆరు టిఎంసిల నీటిని కిందకు విడుదల చేయకుండా నాగార్జున సాగర్ వద్దే నిలిపివేసిన తెలంగాణ ప్రభుత్వంపై ఏపి సర్కార్ కారాలు మిరియాలు నూరుతోంది. మరోవైపు రాజోలిబండ ఆధునీకరణ పనులకు సహకరించకపోతే ఎగువ రాష్ట్రంగా తెలంగాణ ఏం చేయగలుగుతుందో అది చేస్తుందని ఆ రాష్ట్ర నీటిపారుదల మంత్రి హరీశ్‌రావు హెచ్చరించడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. పైగా రాజోలిబండ ఆధునీకరణ పనులను కర్నాటక సోమవారం చేపడితే, వాటిని ఆపేయాలంటూ ఏపి సర్కార్ లేఖ రాసిందని, ఇది దుర్మార్గమని హరీశ్ రావు అన్నారు. కరవు తీవ్రత దృష్ట్యా మంచినీటి ఎద్దడి నివారణకోసం శ్రీశైలం ప్రాజెక్టునుంచి 9 టిఎంసిల నీటిని విడుదల చేయాలని కృష్ణా రివర్ మేనేజ్‌మెంట్ బోర్డ్ (కెఆర్‌ఎంబి) వారం కిందటే నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు అధికారులను ఆదేశించడంతో 9 టిఎంసిల్లో ఆరు టిఎంసిల నీరు ఇప్పటికే సాగర్ చేరుకుంది. అయినా ఈ నీటిని దిగువకు విడుదల చేయడంలో అలవిమాలిన జాప్యం జరుగుతోంది. ఈ విషయాన్ని అపెక్స్ కమిటీ దృష్టికి తీసుకువెళ్లాలని ఏపి సర్కార్ భావిస్తుండగా, ఆర్డీఎస్‌పై తేల్చేవరకూ డెల్టాకు నీరు విడుదల చేయబోమంటూ హరీశ్ నిర్ద్వంద్వంగా ప్రకటించిన విషయాన్ని ‘ఆంధ్రభూమి’ మంగళవారం ‘మరో జలజగడం’ శీర్షికన ప్రచురించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పిట్ట పోరు పిట్ట పోరు పిల్లి తీర్చినట్టు వివాద పరిష్కారానికి స్వయంగా కృష్ణా నదీ యాజమాన్య బోర్డు రంగంలోకి దిగింది. తక్షణమే కృష్ణా డెల్టాకు 1.4 టిఎంసి నీటిని విడుదల చేయాలని ఆదేశించింది. అయితే ఆరు టిఎంసిల నీరు విడుదల కావలసిఉండగా అరకొర జలాలను వదలడంవల్ల డెల్టాకు ఏమాత్రం ప్రయోజనం లేదని ఏపి ప్రభుత్వం పెదవి విరుస్తోంది. కాగా బోర్డు ఆదేశాల మేరకు అధికారులు మంగళవారం మధ్యాహ్నం సుమారు 3,700 క్యూసెక్కుల నీటిని దిగువకు విడిచిపెట్టారు.
ఇదిలాఉండగా తెలంగాణ మంత్రి హరీశ్‌రావు మంగళవారం హైదరాబాద్‌లో విలేఖరులతో మాట్లాడుతూ ఆర్డీఎస్ పనుల్ని ఆంధ్రప్రదేశ్ సర్కార్ ఉద్దేశపూర్వకంగా అడ్డుకుంటోందన్నారు. ఏపి వైఖరిపై కృష్ణా రివర్ మేనేజ్‌మెంట్ బోర్డుకు ఫిర్యాదు చేయనున్నట్టు తెలిపారు. ‘తెలంగాణ ఎగువ రాష్ట్రం. మీరు ఇలానే ఇబ్బందులు పెడితే నష్టపోయేది ఆంధ్రానే. రాజోలిబండ పనులను అడ్డుకుంటే పులిచింతలకు ఇబ్బందులు తప్పవు’ అని హెచ్చరించారు. రాజోలిబండ ఆధునీకరణ, ఎత్తుపెంచే పనులకు సంబంధించి ఆంధ్రప్రదేశ్, కర్నాటకల మధ్య ఉమ్మడి రాష్ట్రంలోనే ఒప్పందం కుదిరిందని, ఆ ఒప్పందాన్ని గౌరవించాల్సిన బాధ్యత ఆంధ్రప్రదేశ్‌కు లేదా? అని హరీశ్‌రావుప్రశ్నించారు. రాజోలిబండ పనులను కర్నాటక సోమవారం ప్రారంభించగా, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు కర్నూలు అధికారులు పనులు నిలిపివేయాలంటూ కర్నాటక అధికారులను ఆదేశించారని హరీశ్‌రావు ఆరోపించారు. ఈ మేరకు ఆదోని ఆర్‌డిఓ కర్నాటక అధికారులకు లేఖ ఇచ్చారని తెలిపారు. ఆ లేఖ ఉపసంహరించుకోవడంతోపాటు పాత ఒప్పందం మేరకు రాజోలిబండ పనులు కొనసాగించాలని, తమకు అభ్యంతరం లేదంటూ చంద్రబాబు కర్నాటకకు లేఖ రాయాలని హరీశ్‌రావు డిమాండ్ చేశారు. ఆర్డీఎస్‌పై చర్చలకు రమ్మని ఏపి మంత్రి దేవినేనికి ఎన్నిసార్లు ఫోన్ చేసినా స్పందన లేదని ఆయన చెప్పారు. చివరకు మంగళవారం సాయంత్రం కూడా ఫోన్ చేశానన్నారు. చంద్రబాబు, జగన్ కలసి తెలంగాణ ప్రాజెక్టులను అడ్డుకోవాలని కుట్ర పన్నుతున్నారని హరీశ్ ఆరోపించారు. పాలమూరు ఎత్తిపోతల పథకం కొత్తది కాదని, ఉమ్మడి రాష్ట్రంలో తీసుకున్న నిర్ణయమేనని తెలిపారు. ఈ ప్రాజెక్టుపై జగన్ దీక్ష చేయడం అర్ధం లేనిదని విమర్శించారు.
హరీశ్ ఆరోపణలు అబద్ధం: దేవినేని
హరీశ్‌రావు చేసిన ఆరోపణలపై ఏపి మంత్రి దేవినేనితో మాట్లాడేందుకు ‘ఆంధ్రభూమి ప్రతినిధి’ ప్రయత్నించారు. ఆర్డీఎస్ పనులను అడ్డుకునేందుకు కర్నూలు అధికారులతో లేఖ రాయించామనడంలో వాస్తవం లేదని మంత్రి తెలిపారు. ఆర్డీఎస్ పనులపైన, కృష్ణా డెల్టాకు రావలసిన నీటి విడుదలను తెలంగాణ సర్కార్ నిలిపివేయడంపైనా బుధవారం విలేఖరుల సమక్షంలో మాట్లాడతానన్నారు.
chitram....
కొండంత ఆనకట్ట. చిన్న తూము నుంచి నీళ్లు. ఇదీ సాగర్ జలాశయం వద్ద పరిస్థితి. కెఆర్‌ఎంబి ఆదేశాల మేరకు
కృష్ణా డెల్టాకు 1.4 టిఎంసి నీటిని విడుదల చేయడంతో, చిన్న తూము నుంచి కిందకు ప్రవహిస్తున్న జలాలు.