రాష్ట్రీయం

క్లీన్‌గా క్రమబద్ధీకరణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మే 17: రాష్ట్రంలో పనిచేస్తున్న కాంట్రాక్టు ఉద్యోగుల సర్వీసుల క్రమబద్ధీకరణ ప్రక్రియ నెలాఖరులోగా పూర్తి చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. క్రమబద్ధీకరించిన ఉద్యోగులకు నియామక ఉత్తర్వులను జూన్ 2న జరుగనున్న తెలంగాణ రాష్ట్రావతరణ దినోత్సవ వేదికపై లాంఛనప్రాయంగా సిఎం చేతులు మీదుగా అందించాలని నిర్ణయించింది. కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణపై సచివాలయంలో మంగళవారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ వివిధ శాఖలకు చెందిన ముఖ్య కార్యదర్శులతో సమావేశమయ్యారు. ఉద్యోగుల క్రమబద్ధీకరణపై భవిష్యత్‌లో న్యాయపరమైన చిక్కులు తలెత్తకుండా అనుసరించాల్సిన మార్గదర్శకాలను రాజీవ్‌శర్మ జారీ చేశారు. కాంట్రాక్టు ఉద్యోగుల నియామకం జరిగినప్పుడు రూల్ ఆఫ్ రిజర్వేషన్, మెరిట్, వయో పరిమితి పాటించిన వారికి మాత్రమే సర్వీసులను మొదట క్రమబద్ధీకరణ చేయాలని రాజీవ్ శర్మ సూచించారు. ప్రాథమికంగా ఇప్పటి వరకు ప్రభుత్వానికి అందిన కాంట్రాక్టు ఉద్యోగుల జాబితాలో అన్ని అర్హతలు కలిగిన వారి సంఖ్య 13,671గా గుర్తించినట్టు అధికార వర్గాల సమాచారం. కాంట్రాక్టుల ఉద్యోగుల సంఖ్య దాదాపు 18 వేలవరకు ఉంటుందని ప్రభుత్వానికి 47 శాఖల నుంచి జాబితాలు అందాయి. అయితే ఇందులో అన్ని అర్హతలు కలిగిన వారితోపాటు నోటిఫై చేసిన ఖాళీల సంఖ్య కూడా 13,641 మాత్రమే ఉందని తేలింది. దీంతో మొదటి విడతలో వీరి సర్వీసులను మాత్రమే క్రమబద్ధీకరిస్తున్నట్టు సమాచారం. కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణకు వివిధ రాష్ట్రాలు అనుసరించిన విధానాలు, అలాగే సుప్రీం కోర్టు, హైకోర్టులు గతంలో చేసిన సూచనలను పాటించాలని రాజీవ్ శర్మ సూచించారు. ఇతర రాష్ట్రాలకంటే పంజాబ్ రాష్ట్రంలో జరిగిన ఉద్యోగుల క్రమబద్ధీకరణ పకడ్బంధిగా జరిగినట్టు అధ్యయనంలో తేలిందని రాజీవ్ శర్మ గుర్తు చేశారు. ఈ అంశంలో పంజాబ్ అనుసరించిన విధానాన్ని రాష్ట్రంలో అమలు చేయాలని సిఎస్ మార్గనిర్దేశం చేశారు. తను సూచించిన విధంగా తొలి దశ క్రమబద్ధీకరణకు అర్హులైన ఉద్యోగుల జాబితాలు అన్ని శాఖల నుంచి ఈనెల 21లోగా అందించాలని ఆదేశించారు. మొదటి విడతలో జరగబోయే క్రమబద్ధీకరణకు అత్యధికంగా ఇంటర్మీడియట్ బోర్టు పరిధిలో పని చేసే 5,757 మంది ఉద్యోగులు ఉండగా, రెండోస్థానంలో వైద్య ఆరోగ్య శాఖలో 2,473 ఉద్యోగులు ఉన్నట్టు సమీక్ష సమావేశంలో అధికారులు వివరించారు.