రాష్ట్రీయం

అకాల వర్షం.. మార్కెట్‌లో తడిసిన ధాన్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జనగామ టౌన్, ఏప్రిల్ 29: జనగామలో ఆదివారం సాయంత్రం కురిసిన అకాల వర్షానికి స్థానిక వ్యవసాయ మార్కెట్‌లోని ధాన్యమంతా తడిసిపోయింది. ఉదయం 10గంటల నుండి సాయంత్రం 4గంటల వరకు వేడిగా ఉన్న వాతావరణం ఒక్కసారిగా ఆకాశం మేఘావృతమై ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసింది. దీంతో మార్కెట్‌లో ఉన్న ధాన్యమంతా తడిసి ముద్దయింది. అకస్మాత్తుగా కురిసిన అకాల వర్షానికి తమ ధాన్యాన్ని కాపాడుకునేందుకు రైతులు నానా ఇబ్బందులు పడ్డారు. అయినప్పటికీ అధికంగా గాలి రావడంతో రాసులపై వేసిన టార్పిన్స్ చెల్లాచెదురై ధాన్యం తడిసిపోయింది. మార్కెట్ పల్లపు ప్రాంతంలో ఉన్న ధాన్యం రాసుల్లోకి వరదనీరు చేరి కొన్ని రాసులు కొట్టుకుపోయాయి. ఆదివారం మార్కెట్‌కు సెలవు కావడంతో అధికారులు, సిబ్బంది అందుబాటులో లేనందున రైతులు తమ బాధలను ఎవరికి చెప్పుకోవాలో తెలియక ఆవేదనకు గురయ్యారు. పాత మార్కెట్‌లో ఉన్న వేలాది బస్తాలు తడిసిపోయాయి.

చిత్రం..తడిసిన ధాన్యం బస్తాలు