రాష్ట్రీయం

నిరుద్యోగికి టోకరా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మే 27: మోటార్ వెహికల్ ఇన్‌స్పెక్టర్ ఉద్యోగాలు ఇప్పిస్తామని మాయమాటలు చెప్పి నిరుద్యోగులను నిండా ముంచుతున్న నేరస్తులను టాస్క్‌పోర్స్ అదుపులోకి తీసుకుని సొత్తును రికవరీ చేసింది. ఈ సంఘటనకు సంబంధించిన వివరాలు టాస్క్ఫోర్స్ డిసిపి బి. లింబారెడ్డి విలేఖరుల సమావేశంలో వెల్లడించారు. బేగంపేట్‌లోని రాజీవ్‌గాంధీ ఏవియేషన్ విభాగంలో చీఫ్ ట్రైనర్ వద్ద డ్రైవర్‌గా పనిచేస్తున్న పెండ్యాల తిరుపతయ్య అలియాస్ తిరుమల్‌రాజుకు ఎపిలోని కృష్ణాజిల్లా కోడూరుకు చెందిన పి.శ్రీనివాస్ మాజీ ఎమ్మెల్యే రామారావును కలవడానికి వచ్చి పరిచయమయ్యాడు. తిరుమల్‌రాజ్ మాయమాటలు నమ్మిన శ్రీనివాస్‌రావు తనను మోటాల్ వెహికల్ ఇన్‌స్పెక్టర్ ఉద్యోగానికి సిఫార్సు చేయించాలని కోరాడు. ఇదే అదనుగా భావించిన తిరుమల్‌రాజ్ తమ సంస్థలోనే పనిచేసే సయ్యద్ కొమర్ హుస్సేన్ అలియాస్ నవాబ్‌కు విషయం చెప్పాడు. నవాబ్ మరో ఇద్దరు మీర్ కర్రర్ అలీ, మహమ్మద్ అలీలకు పరిచయం చేయడంతో అందరూ కలిసి హైద్రాబాద్ తాజ్‌మహల్ హోటల్‌లో సమావేశమయ్యారు.
ఈ సందర్భంగా వారు బాధితుడు శ్రీనివాస్‌తో తమకు టిఎస్‌పిఎస్‌సిలో ఉన్నతాధికారులతో మంచి పరిచయాలు ఉన్నాయని తప్పకుండా పనిచేసిపెడతామని, అందుకు రూ.31లక్షలు ఖర్చు అవుతుందని చెప్పారు. రూ.2లక్షలు అడ్వాన్స్‌గా తీసుకుని అగ్రిమెంట్ కుదుర్చుకున్నారు. ఇందులో భాగంగా 2015 డిసెంబర్‌లో తిరుమల్‌రాజ్ శ్రీనివాస్ నుంచి మొదటివిడతగా 10 లక్షలు తీసుకున్నాడు. తాను పరిచయం చేసిన మహమ్మద్ అలీ, మీర్‌అలీలు బాధితునికి సమాధానం చెప్పకుండా దాటవేస్తుండడంతో తన ఇంటి వద్ద ఉండే షేక్ యాకుబ్ అలీ అలియాస్ కోటేశ్వర్‌రావును టిఎస్‌పిఎస్‌సిలో కంప్యూటర్ విభాగంలో పనిచేస్తాడంటూ పరిచయం చేశాడు. ఈ ఏడాది ఫిబ్రవరి 14న టిఎస్‌పిఎస్‌సి విడుదల చేసిన మొదటి జాబితాలో తన హాల్ టికెట్ నెంబర్ లేకపోవడంతో కంగారు పడిన శ్రీనివాస్ వెంటనే తిరుమల్‌రాజ్‌ను ప్రశ్నించాడు. అదే రోజు సాయంత్రం తిరుమల్‌రాజ్, యాకుబ్ అలీలు సికింద్రాబాద్ ప్యారడైజ్ హోటల్‌లో శ్రీనివాస్‌ను కలిసి టిఎస్‌పిఎస్‌సి కంప్యూటర్ విభాగంలో పనిచేసే మరో ఇద్దరు శ్రీనివాస్ పేరును ఉంచడానికి ఒప్పుకోవడం లేదని, వారికి కూడా కొంత మొత్తం ముట్టజెప్పాలని చెప్పారు. రెండో దపా వచ్చే లిస్టులు తప్పకుండా పేరు ఉంటుందని చెప్పడంతో నమ్మిన శ్రీనివాస్ రూ.5.88 లక్షలు వారికి ఇచ్చాడు. ఆ తర్వాత రెగ్యులర్‌గా టచ్‌లో ఉంటూ ఎప్పటికప్పుడు నమ్మబలుకుతూ కాలయాపన చేశారు. గత నెల 13న రెండవ లిస్టులో సైతం తన నంబర్ లేకపోవడంతో కంగుతున్న శ్రీనివాస్ వెంటనే తిరుమల్‌రాజ్‌ను సంప్రదించగా అప్పటినుంచి నిందితులంతా సెల్‌ఫోన్లు స్విచాఫ్ చేసుకుని తిరుగుతున్నారు. విషయం టిఎస్‌పిఎస్‌సి అధికారులకు తెలియడంతో వారు పోలీసులకు సమాచారం అందించారు. బాధితుడి నుంచి పూర్తి సమాచారం తెలుసుకున్న జూబ్లీహిల్స్ పోలీసులు కేసును నమోదు చేసుకుని దర్యాప్తు ముమ్మరం చేశారు. విశ్వసనీయ సమాచారంతో నగరంలోని కృష్ణానగర్, వౌలాలి ప్రాంతంలో నిందితులను అదుపులోకి తీసుకుని వారి నుంచి రూ.15 లక్షల 88వేల నగదును, నాన్‌జ్యుడిషియల్ బాండ్ పేపర్, ప్రామిసరి నోట్‌లు, సెల్‌ఫోన్‌లు స్వాధీనం చేసుకుని,రిమాండ్‌కు తరలించారు.