రాష్ట్రీయం

ఇక్కడ మేమే బాద్‌షాలం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖమ్మం, నవంబర్ 5: తెలంగాణ రాష్ట్రంలో తామే బాదుషాలం అని, ప్రజాప్రతినిధిగా ఉన్న కేసీఆర్‌పై అసత్య ఆరోపణలు చేస్తే ఊరుకోమని, వికృత రాజకీయాలు చేయాలని చూస్తే తరిమికొడతామని రాష్ట్ర ఆపద్ధర్మ ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ విపక్షాలను హెచ్చరించారు. ఖమ్మం నగరంలో టీఆర్‌ఎస్ అభ్యర్థి పువ్వాడ అజయ్‌కుమార్ విజయాన్ని కాంక్షిస్తూ సోమవారం ముస్లింలతో జరిగిన ఆత్మీయ సమావేశంలో ఆయన మాట్లాడారు. ముస్లింల అభివృద్ధి, సంక్షేమం, రక్షణ గురించి ఆలోచించిన ఏకైక పార్టీ టీఆర్‌ఎస్ అని ఆయనన్నారు. దేశంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న రాష్ట్రం తెలంగాణ అని, ప్రజల సహకారంతో రాష్ట్రాన్ని బంగారు తెలంగాణగా మార్చే ప్రయత్నం చేస్తుంటే కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలు పరాయి పెత్తనం మోపేందుకు ప్రయత్నిస్తున్నాయని విమర్శించారు. పార్టీని మూసేయటానికైనా వెనుకాడబోమని, అంతేకాని బీజేపీ, కాంగ్రెస్‌తో కలిసే ప్రసక్తే లేదని మహమూద్ అలీ స్పష్టం చేశారు. ముస్లింలను ఆర్థికంగా అణగదొక్కడంతో పాటు వక్ఫ్ బోర్డు భూములు అన్యాక్రాంతం అవుతుంటే పట్టించుకోని పార్టీలు ఇప్పుడు ముస్లింల ఓట్లు అడగడం బాధాకరమన్నారు. దేశంలో ముస్లింలకు ఏ పార్టీ కూడా రెవిన్యూ మంత్రి పదవి ఇవ్వలేదని గుర్తుచేశారు. ముస్లింలకు మంత్రి పదవి ఇచ్చి గౌరవించిన ఘనత కేసీఆర్‌దేనని, తాను రెవిన్యూ మంత్రిగా 45వేల ఎకరాల భూములను తిరిగి రికార్డుల్లో పొందుపర్చగలిగానన్నారు. ముస్లింల పిల్లలను ఐఏఎస్ లాంటి ఉన్నత చదువులు చదివించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రణాళికలు రచించారని, పేద ముస్లిం పిల్లల విదేశీ విద్య కోసం కృషి చేస్తున్నారని చెప్పారు. దేశంలోనే మైనార్టీల సంక్షేమానికి అత్యధిక బడ్జెట్ కేటాయించింది తామేనని, 60ఏళ్లలో కాంగ్రెస్, టీడీపీ చేయలేని పనులను నాలుగేళ్లలో కేసీఆర్ నాయకత్వంలో టీఆర్‌ఎస్ ప్రభుత్వం చేసి చూపిందన్నారు. అల్లర్లు, గొడవలు లేని రాష్ట్రంగా తెలంగాణను తీర్చిదిద్దామన్నారు. టీఆర్‌ఎస్‌ది సెక్యులర్ ప్రభుత్వమని, దేశంలో కేసీఆరే పెద్ద సెక్యులరిస్ట్ అని మహమూద్ అలీ పేర్కొన్నారు. సమావేశంలో పువ్వాడ అజయ్‌కుమార్, ఐడీసీ చైర్మన్ ఎస్‌బీ బేగ్ పాల్గొన్నారు.

చిత్రం..ముస్లింల ఆత్మీయ సమావేశంలో మాట్లాతున్న ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ