రాష్ట్రీయం

నగదు బదిలీ పథకానికి రంగం సిద్ధం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 5: రాష్ట్రంలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాల ఫలాలు నేరుగా లబ్ధిదారులకు అందే విధంగా చూసేందుకు, దళారుల పాత్రను తొలగించేందుకు నగదు బదిలీ పథకాన్ని చంద్రబాబు ప్రభుత్వం త్వరలో శ్రీకారం చుట్టనుంది. దీనికి సంబంధించిన విధి విధానాలను ప్రభుత్వం త్వరలో ఖరారు చేస్తుంది. నగదు బదిలీ పథకం మంచిదని 2009 ఎన్నికల్లోనే ప్రస్తావించిన చంద్రబాబు ప్రస్తుతం ఆ పథకాన్ని రాష్ట్ర స్ధాయిలో రెండు పథకాల్లో అమలు చేయాలని నిర్ణయించారు. తొలి దశలో సామాజిక భద్రత పింఛను పథకానికి, జాతీయ ఉపాధి హామీ పథకం లబ్ధిదారులకు నగదు బదిలీ పథకానికి పరిమితం చేస్తారు. దేశ వ్యాప్తంగా ఎల్‌పిజి గ్యాస్ సిలిండర్ వినియోగదారులకు కేంద్రం ప్రస్తుతం నగదు బదిలీ పథకాన్ని అమలు చేస్తోంది. రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా రాష్ట్రప్రభుత్వానికి నగదు బదిలీ పథకాన్ని అమలు చేయాలని లేఖ రాసింది. దీని వల్ల సంక్షేమ పథకాల జాబితాలో ఉన్న లబ్ధిదారుల బ్యాంకుల్లో ప్రభుత్వం ఇచ్చే నగదు జమ అవుతుంది.
ప్రస్తుతం సామాజిక సంక్షేమ పథకం కింద 42,10,143 మందికి పెన్షన్లను ప్రభుత్వం చెల్లిస్తోంది. దీనికి సాలీనా రూ.5000 కోట్లను ఖర్చుపెడుతున్నారు. అలాగే జాతీయ ఉపాధి హామీ పథకం కింద సాలీనా రూ. 5400 కోట్లను ఖర్చుపెడుతున్నారు. ఈ ఉపాధిహామీ పథకం కింద 92,50,954 మంది ఉన్నారు. సామాజిక పెన్షన్ల పథకం కింద ఉన్న 42,10,143 మందిలో 41,28,530 మందికి ఆధార్ కార్డులున్నాయి. ఆదార్ కార్డు అనుసంధానం కింద బ్యాంకుల్లో వీరి పేర్లు నమోదై ఉన్నాయి. ఈ కేటగిరీలో 98.06 శాతం ఆధార్ లింక్‌తో ఉన్నాయి. అలాగే జాతీయ ఉపాధి హామీ కింద 92.50 లక్షల మందిలో 84.20 లక్షల మందికి ఆధార్ కార్డులు ఉన్నాయి. మరో 83వేల మందికి ఆధార్ కార్డులు ఇవ్వాల్సి ఉంది. దాదాపు 91 శాతం మంది జాతీయ ఉపాధి హామీ పథకం కింద కార్మికులు అధార్‌తో అనుసంధానమై ఉన్నారు.
ప్రస్తుతం ఈ రెండు స్కీముల్లో లబ్ధిదారులకు పోస్ట్ఫాసుల ద్వారా చెల్లింపులు చేస్తున్నారు. క్షేత్ర స్థాయిలో కొన్నిచోట్ల నగదును స్వయంగా చెల్లిస్తున్నారు. దీని వల్ల అనేక అవకతవకలు జరుగుతున్నట్లు ప్రభుత్వానికి లెక్కలేనన్ని ఫిర్యాదులు వస్తున్నాయి. అలాగే నగదు పంపిణీలో అవకవతవకలు జరిగి లబ్ధిదారులకు నిర్దేశించిన సొమ్ము చేరడం లేదు. ఉత్తరాంధ్రలోని మూడు జిల్లాలు, గోదావరి జిల్లాల్లో ప్రధానంగా ఈ సమస్యలు తలెత్తుతున్నాయి. చాలా చోట్ల లబ్ధిదారులకు నగదును పంపిణీ చేయాలంటే క్షేత్రస్థాయిలో ఉన్న అధికారులు ఎటిఎంలకు వెళితే అవసరమైన సొమ్ము డ్రా కావడం లేదు. అదే బ్యాంకుల ద్వారా లబ్ధిదారులకు సొమ్మును చెల్లించడం వల్ల బ్యాంకుల ఆర్థిక లావాదేవీలు పెరిగి క్యాష్ మేనేజిమెంట్ సులభమవుతుందని ఆర్‌బిఐ రాష్ట్రప్రభుత్వానికి రాసిన లేఖలో పేర్కొన్నట్లు ఆర్థిక శాఖ వర్గాలు తెలిపాయి.