క్రైమ్/లీగల్

ఐదుగురు పోలీస్ అధికారులకు రాకేశ్ రెడ్డి ఫోన్?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 18: పారిశ్రామికవేత్త చిగురుపాటి జయరాం హత్య తర్వాత నిందితుడు రాకేశ్ రెడ్డి పలువురు పోలీసు అధికారులకు ఫోన్లు చేసినట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. రాకేశ్ ఆ అధికారులకు ఎందుకు ఫోన్ చేశాడనే కోణంలో కూడా విచారణ జరుపుతున్నారు. ఈ కేసులో ప్రధాన నిందితుడైన రాకేశ్ రెడ్డికి ఇప్పటి వరకు సొంత బ్యాంక్ అక్కౌంట్ కూడా లేదని, ఇప్పటి వరకు నగదు లావాదేవీలు చేశాడని పశ్చిమ మండలం డీసీపీ ఏఆర్ శ్రీనివాస్ సోమవారం విలేఖరుల సమావేశంలో తెలిపారు. రాకేశ్ రెడ్డి లోగడ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసినట్లు ఆయన చెప్పారు. నాలుగు రోజుల నుంచి చాలా మందిని విచారించామని, పలువురి బ్యాంకు ఖాతాలు, ఇతర పత్రాలనూ పరిశీలించామని ఆయన తెలిపారు. ఈ కేసులో రాకేశ్ రెడ్డి, శ్రీనివాస్‌తో పాటు రౌడీషీటర్ నగేష్, ఆయన అల్లుడు విశాల్ ప్రమేయం ఉన్నట్లు ప్రాథమిక విచారణలో స్పష్టమైనట్లు డీసీపీ చెప్పారు. పోలీసు అధికారుల ప్రమేయం ఉందా? అనే కోణంలో కూడా విచారణ జరపనున్నట్లు ఆయన తెలిపారు. రాకేశ్ రెడ్డి జయరాంకు డబ్బులు ఇచ్చాడా? రూ.4.5 కోట్లు డిమాండ్ చేశాడా? అనే విషయంలో స్పష్టత రాలేదన్నారు. రాజకీయ నాయకులతో రాకేశ్‌కు సంబంధాలు ఉన్నట్లు అనుమానిస్తున్నామని డీసీపీ శ్రీనివాస్ చెప్పారు.