రాష్ట్రీయం

లోక్‌సభ ఎన్నికల షెడ్యూలుతో ప్రవేశ పరీక్షల తేదీల్లో మార్పులు?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 12: లోక్‌సభ ఎన్నికల షెడ్యూలు రాష్ట్రంలో నిర్వహించే పరీక్షలకు, ప్రవేశపరీక్షలకు ఎలాంటి ఆటంకం లేకున్నా జాతీయ స్థాయిలో నిర్వహించే పరీక్షలకు ఇబ్బంది కలిగేలా ఉంది, ఈ క్రమంలోనే కర్నాటక నిర్వహించే కేసెట్ పరీక్షల షెడ్యూలులో మార్పులు చేసింది, అలాగే జేఈఈ అడ్వాన్స్ షెడ్యూలులో కూడా ఒకరోజు అటో, ఇటో మారే అవకాశం ఉందని చెబుతున్నారు.
ఇంత వరకూ నిర్ణయించిన షెడ్యూలు ప్రకారం జేఈఈ మెయిన్స్ ఏప్రిల్ 7 నుండి 20 వరకూ స్లాట్‌లను ఖరారు చేశారు. అయితే మెయిన్స్ పరీక్ష కేవలం రెండు మూడు రోజుల్లో ముగించే అవకాశం ఉంది. అంటే ఏప్రిల్ 7 నుండి 9వ తేదీలోగా దానిని ముగించే వీలుంది. అలాంటపుడు ఏప్రిల్ 11న జరిగే ఎన్నికలకు ఎలాంటి ఆటంకం ఉండబోదని భావిస్తున్నారు. ఒక వేళ విద్యార్థులు మిగిలిపోయే పక్షంలో 10వ తేదీన వారికి ఆన్‌లైన్ పరీక్ష నిర్వహిస్తారు.
తెలంగాణలో ఎన్నికలకు ఈ పరీక్షకు ఎలాంటి ఆటంకం కలగదు. అదే విధంగా మిగిలిన రాష్ట్రాల్లో రెండో దశ ఏప్రిల్ 18న ఎన్నికలు జరుగుతాయి కనుక ఆనాటికి జేఈఈ మెయిన్స్ పూర్తవుతుంది. ఆ తర్వాతి దశల్లో ఎన్నికలు ఏప్రిల్ 23,29, మే 6, మే 12, మే 19వ తేదీల్లో జరగనున్నాయి. జేఈఈ అడ్వాన్స్‌డ్ పరీక్ష మే 19న జరగాల్సి ఉంది. కనుక ఎన్నికల షెడ్యూలుతో ఇబ్బంది అవుతుంది కనుక జేఈఈ మెయిన్స్ పరీక్ష ముగిసిన వెంటనే అడ్వాన్స్ పరీక్షపై ఒక నిర్ణయం తీసుకోనున్నారు. మొదటి దశలో 9.4 లక్షల మంది దరఖాస్తు చేయగా, రెండో దశలో 9.54 లక్షల మంది మెయిన్స్‌కు దరఖాస్తు చేశారు. గత ఏడాది ఒకేమారు జేఈఈ మెయిన్స్ నిర్వహించగా ఆ పరీక్షకు 11.40 లక్షల మంది దరఖాస్తు చేశారు. రెండోసారి దరఖాస్తు చేసిన వారిలో 15 శాతం మంది మాత్రమే కొత్తవారు కాగా, మిగిలిన వారంతా మొదటి దశ పరీక్ష రాసిన వారే. దేశవ్యాప్తంగా ఐఐటీల్లో 4023 సీట్లు, ఎన్‌ఐటీల్లో 17967 సీట్లు, సీటీఐల్లో 4683 సీట్లు అందుబాటులో ఉన్నాయి.
మారిన కేసెట్ షెడ్యూలు
మారిన షెడ్యూలు ప్రకారం కేసెట్ ఏప్రిల్ 29, 30 తేదీల్లోనూ , లాంగ్వేజి పరీక్ష మే 5న జరగనుంది. దీంతో దరఖాస్తు గడువును మార్చి 20 వరకూ పొడిగించారు.