రాష్ట్రీయం

కొలిక్కివస్తున్న అసెంబ్లీ ఉద్యోగుల విభజన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 29: అసెంబ్లీ, కౌన్సిల్ కార్యాలయం ఉద్యోగుల విభజన కొంతవరకు కొలిక్కివచ్చింది. విభజన చేసి ఇరు రాష్ట్రాలకు కేటాయించిన ఉద్యోగుల జాబితాలను మంగళవారం అసెంబ్లీ ఆవరణలోని నోటీసు బోర్డులో పెట్టారు. అయినా ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ కార్యాలయంలోనే ఉండిపోయిన ఉద్యోగులు తీవ్ర నిరాశ, అసంతృప్తితో ఉన్నారు. దీంతో బుధవారం ఇరువురు అధికారులు, పలువురు ఉద్యోగులు తెలంగాణ అసెంబ్లీ కార్యదర్శి డాక్టర్ ఎస్.రాజా సదారామ్‌ను కలిసి తమ బాధను వ్యక్తం చేశారు. అందుకు ఆయన స్పందిస్తూ ఈ విభజనపై ఏవైనా అభ్యంతరాలు ఉంటే తెలియజేయడానికి జూలై 14వ తేదీ గడువు విధించాం కాబట్టి ఆ తర్వాత పరిశీలిస్తామని చెప్పారు.
ఉభయ రాష్ట్రాల కౌన్సిల్, అసెంబ్లీలకు కలిపి మొత్తం 308 మంది ఉద్యోగులు ఉన్నారు. రాష్ట్ర విభజనకు ముందు, అంతకంటే ముందు 440 మంది ఉద్యోగులు ఉండేవారు. చాలా మంది పదవీ విరమణ చేసినా, ఉద్యోగ నియామకాలు లేకపోవడంతో ఉన్న వారిపైనే పని భారం పెరిగింది. రాష్ట్ర విభజన తర్వాత అసెంబ్లీ ఉద్యోగుల విభజన చేయడంతో ఆంధ్రప్రదేశ్‌కు 170కిపైగా, తెలంగాణకు 130కి పైగా ఉద్యోగాలు దక్కాయి. కాగా నిష్పత్తి ప్రకారం ఆంధ్రకే సుమారు 50 ఉద్యోగాలు అధికంగా లభించాయి. దీంతో తెలంగాణ ఉద్యోగులు ఆందోళన చెందారు. పైగా ఎపి సిఎం చంద్రబాబు ఉద్యోగులు విజయవాడకు తరలి రావాలంటూ ఆదేశించడంతో వారిలో మరింత ఆందోళన పెరిగింది. ఈ దశలో కమల్‌నాథన్ కమిటీ చేతులెత్తేసింది. చట్టసభ కాబట్టి తాము జోక్యం చేసుకోలేమని, ఇరు రాష్ట్రాల అసెంబ్లీల స్పీకర్లు, కార్యదర్శులు పరిష్కరించుకోవాలని ఆ కమిటీ సూచించింది. దీంతో ఎపి కౌన్సిల్ చైర్మన్ ఎ.చక్రపాణి, ఎపి అసెంబ్లీ స్పీకర్ కోడెల శివప్రసాద రావు, తెలంగాణ కౌన్సిల్ చైర్మన్ ఎ.స్వామిగౌడ్, అసెంబ్లీ స్పీకర్ ఎస్.మధుసూదనాచారి ఇటీవల సమావేశమై ఉద్యోగుల విభజన అంశాన్ని చర్చించారు. ఉద్యోగులు తమకు ఇష్టం వచ్చిన రాష్ట్రానికి ఆప్షన్ ఇచ్చుకోవాల్సిందిగా సూచించారు. దీంతో ఆంధ్రలో ఉన్న తెలంగాణకు చెందిన సుమారు 50 మంది ఉద్యోగులు తెలంగాణకు ఆప్షన్ ఇచ్చారు. దీనిపై అసెంబ్లీల కార్యదర్శులు తర్జనభర్జన చేసి ఉద్యోగుల విభజన చేసి నోటీసు బోర్డులో పెట్టారు. కాగా తెలంగాణ ఆప్షన్ ఇచ్చినా విభజనలో బదిలీ కాని ఉద్యోగులు ఆవేదన ఇంతా అంతా కాదు. బదిలీ కాకుండా ఆంధ్రలో ఉండిపోయిన అసెస్టింట్ కార్యదర్శి సంజీవ రావు, సెక్షన్ ఆఫీసర్ వేణు, టెలిఫోన్ ఆపరేటర్, ఇద్దరు స్వీపర్లు, అటెండర్ ఆందోళన చెందుతున్నారు. బుధవారం సంజీవరావు, వేణు ప్రభృతులు టి.అసెంబ్లీ కార్యదర్శి రాజా సదారామ్‌ను కలిసి తమ గోడు చెప్పుకున్నారు. తెలంగాణకు ఆప్షన్లు ఇచ్చినా, ఉద్యోగాల ఖాళీని దృష్టిలో పెట్టుకునే నిర్ణయం తీసుకున్నామని ఆయన వారికి చెప్పినట్లు సమాచారం. విభజన చేసిన తర్వాత జాబితా ప్రకటించాం, దీనిపై అభ్యంతరాలు, విజ్ఞప్తులు ఎలా ఉంటాయో పరిశీలించి మీకూ న్యాయం చేస్తామని డాక్టర్ సదారామ్ వారికి హామీ ఇచ్చారు. కమల్‌నాథన్ కమిటీ జోక్యం చేసుకోకపోయినా ఆ కమిటీ నిబంధనల ప్రకారమే విభజనకు చర్యలు తీసుకున్నట్లు ఆయన వారికి చెప్పారు.
ఆంధ్రకు తగ్గిపోయిన ఉద్యోగులు..
తాజాగా తీసుకున్న విభజన నిర్ణయంతో సుమారు 50 మంది ఉద్యోగులు ఆంధ్రనుంచి తెలంగాణకు వచ్చారు. కాగా ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ కార్యాలయంలో భారీగా సంఖ్య తగ్గింది. తెలంగాణ కంటే పెద్ద రాష్టమ్రైన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ కార్యాలయంలో 136 మంది ఉద్యోగులు, తెలంగాణకు 172 మంది ఉద్యోగులు మిగిలారు.
ఆంధ్రకే ఆప్షన్ ఇచ్చిన నలుగురు
తెలంగాణకు చెందిన ఉద్యోగులు హనుమంతరావు, కుమారస్వామి, శ్రీనివాస్, సునీల్ ఆంధ్ర అసెంబ్లీకే ఆప్షన్ ఇచ్చారు. ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ఉద్యోగుల పదవీ విరమణ వయస్సును 60కి పెంచినందున అలా కోరుకుని ఉంటారని మిగతా ఉద్యోగులు భావిస్తున్నారు.