రాష్ట్రీయం

పుష్కరాల పేరిట ఆలయాల ధ్వంసం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 30: పుష్కరాల ఏర్పాట్ల పేరిట విజయవాడలో అక్రమంగా దేవాలయాలను కూల్చివేస్తున్నారని హిందూ దేవాయయ ప్రతిష్ఠాన పీఠాధిపతి కమలానంద భారతీస్వామి ఆగ్రహం వ్యక్తం చేశారు. విజయవాడలో కృష్ణానది తీరంతో పాటు, ఇతర ప్రాంతాలలో దాదాపు 45 దేవాలయాలను కూల్చివేశారని, చంద్రబాబు సర్కారుకు దైవ ఆగ్రహం అనుభవించక తప్పదని ధ్వజమెత్తారు. గురువారం ఆబిడ్స్‌లోని అఖిల భారత హిందూ దేవాలయాల పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో జరిగిన విలేఖరుల సమావేశంలో సమితి అధ్యక్ష్య, కార్యదర్శులు లక్ష్మయ్య, సూర్యనారయణతో కలిసి మాట్లాడారు. అభివృద్ధి, ఏర్పాట్ల పేరిట అడ్డగోలుగా దేవాయలయాలను కూల్చివేస్తూ విగ్రహాలను విసిరి పారేస్తున్నారని ఆరోపించారు. పుష్కరాలకు హాజరయ్యే భక్తులు నదీ తీరంలో దేవాలయాలను దర్శించటం ఆనవాయితీ అని అన్నారు. ఎలాంటి ముందస్తు సమాచారం, ప్రత్యామ్నాయ ఏర్పాట్లు, నష్టపరిహారం లాంటివి ఏమీ లేకుండా రాత్రికి, రాత్రి పొలీసు బలగాలను అడ్డం పెట్టుకుని అహంకార ధోరణిలో దేవాలయాలను కూల్చివేయటం దుర్మార్గమని పేర్కొన్నారు. ఆగమ శాస్త్ర నిబందన ప్రకారం ప్రాణ ప్రతిష్ఠ చేసిన దేవాలయాలను కదిలించాలంటే శాస్రోక్తంగా మహామహా మహిమాన్మత పండితుల సమక్షంలో తొలగించాలని అన్నారు. ఇలాంటివి ఏమీ లేకుండా ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్న ఏపి సర్కారు తగు మూల్యం చెల్లించుకోక తప్పదని చెప్పారు. దేవుడి జోలికి, దేవాలయాలకు జోలికి వచ్చిన వారెవ్వరూ బతికి బట్టకట్టని విషయం చరిత్ర ఎన్న సార్లు రుజువు చేసిందని అన్నారు. తొలగించిన దేవాలయాలను పుఃనప్రతిష్ట చేయాలని డిమాండ్ చేశారు.

చిత్రం..విలేఖరులతో మాట్లాడుతున్న కమలానంద భారతీస్వామి