ఆంధ్రప్రదేశ్‌

నేడు కృష్ణా డెల్టాకు గోదావరి నీరు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పోలవరం, జూలై 13: పశ్చిమ గోదావరి జిల్లా పట్టిసం ఎత్తిపోతల పథకం నుండి తోడుతున్న గోదావరి నీరు గురువారం నాటికి కృష్ణా డెల్టాకు చేరుతుందని ఎస్‌ఇ విఎస్ రమేష్‌బాబు తెలిపారు. ఈ నెల 6వ తేదీన ముఖ్యమంత్రి మోటార్లు ఆన్‌చేసిన విషయం విదితమే. కుడి కాలువ నిర్మాణం పూర్తికాని కారణంగా అధికారులు అంచెలంచెలుగా నీటిని తరలిస్తున్నారు. గోపాలపురం, నల్లజర్ల మండలం గొల్లగూడెం వద్ద లాకుల్లో నీటిని నియంత్రించి విడుదలచేస్తున్నారు. మంగళవారం లాకులను పూర్తిగా ఎత్తివేసి నీటిని వదిలారు. ఆ నీరు గురువారం నాటికి కృష్ణా డెల్టాకు చేరుతుందని ఎస్‌ఇ తెలిపారు. మొదటి నుండి రెండు మోటార్లు ఆన్‌చేసి 708 క్యూసెక్కుల నీటిని కుడికాలువలోకి వదిలేవారు. మంగళవారం మరో మోటారు ఆన్ చేశారు. బుధవారం నాటికి నాలుగు మోటార్లు ద్వారా 2,124 క్యూసెక్కుల నీటిని కుడికాలువలోకి వదులుతున్నట్టు తెలిపారు. గురువారం మరో రెండు మోటార్లు ఆన్‌చేసి ఆరు మోటార్ల ద్వారా నీటిని కృష్ణా డెల్టాకు తరలించనున్నట్టు ఆయన వివరించారు. అనంతరం ఎస్‌ఇ పోలవరం ప్రాజెక్టు నిర్మాణ ప్రాంతానికి పడవపై బయలుదేరి వెళ్లారు. కాగా గోదావరి వరద నీరు రామయ్యపేట తవ్వు కాలువ నుండి పైలెట్ ఛానల్ ద్వారా స్పిల్ ఛానల్‌కు చేరింది. వరదల కారణంగా స్పిల్‌వే పనులు ఆశించిన స్థాయిలో జరగడం లేదని, వరద తగ్గిన అనంతరం రెండు రోజుల్లో పూర్తిస్థాయిలో పనులు యథావిధిగా జరుగుతాయని అధికార్లు తెలిపారు.
గోదావరి వరదల కారణంగా విద్యుత్ స్తంభాలు కూలిపోవడంతో తూర్పు, పశ్చిమ గోదావర జిల్లాల్లోని 38 గిరిజన గ్రామాలు అంధకారంలో మగ్గుతున్నాయి.