రాష్ట్రీయం

చదువుల తీరు మారాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 4: ఉన్నత విద్యారంగంలో బోధన విధానంలో మార్పురానిదే విద్యావ్యవస్థ తీరు తెన్నులు మారవని సెంచూరియన్ విశ్వవిద్యాలయం మేనేజింగ్ ట్రస్టీ ప్రొఫెసర్ డి.ఎన్ రావు వ్యాఖ్యానించారు. ప్రతి విద్యార్థిలో తొలి రోజు నుండే నైపుణ్యాలు, కౌశలాలు, సామర్థ్యాలను పెంపొందించాల్సి ఉంటుందని, అప్పుడే నిరుద్యోగాన్ని నివారించగలుగుతామని పేర్కొన్నారు. ఒడిశాలో తొలి ప్రైవేటు యూనివర్శిటీగా సెంచూరియన్ వర్శిటీ ఏర్పాటైనా తెలుగు రాష్ట్రాల విద్యార్థులకూ తమ సేవలను విస్తరిస్తున్నట్టు ఆయన వెల్లడించారు. సోమవారం ఆయన రీజనల్ డైరెక్టర్ జె.ఎం.రావుతో కలిసి పాత్రికేయులతో మాట్లాడుతూ సెంచూరియన్ వర్శిటీ పనితీరును వివరించారు. ప్రైవేటు యూనివర్శిటీగా ఏర్పాటైనా ప్రమాణాల్లో రాజీ పడటం లేదని, అంతర్జాతీయ స్థాయి విశ్వవిద్యాలయాలకు ధీటుగా తాము పనిచేస్తున్నామని దానిని గుర్తించిన నేషనల్ అసెస్‌మెంట్ అండ్ అక్రిడిటేషన్ కౌన్సిల్ (నేక్) తమకు అత్యున్నతమైన ఎ గ్రేడ్‌ను ఇచ్చిందని ఆయన చెప్పారు.
వర్శిటీ ప్రధాన కేంద్రం పర్లాఖిముడిలో ఉండగా, కానిస్టిట్యూయంట్ క్యాంపస్‌ను భువనేశ్వర్‌లో ఏర్పాటు చేశామని, బాలంగీర్, రాయగడ, ఛత్రపూర్, జత్నాల్లో కూడా వర్శిటీ విభాగాలు పనిచేస్తున్నాయని వివరించారు. ప్రస్తుతం వర్శిటీ ప్రాథమిక, మాధ్యమిక విద్యాకోర్సులతో పాటు బి.ఎస్సీ, ఎమ్మెస్సీ, ఎంబిఎ, బిటెక్, ఎంటెక్, పిహెచ్.డిలను ఆఫర్ చేస్తోందని చెప్పారు.
పర్లాఖిముడిలో జగన్నాథ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మేనేజిమెంట్, సెంచూరియన్ స్కూల్ ఆఫ్ రూరల్ ఎంటర్‌ప్రైజ్ మేనేజిమెంట్, భువనేశ్వర్‌లో సెంచూరియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీల్లో వేలాది మంది విద్యార్థులు ఉన్నారని తెలిపారు. సాధారణ విద్యాభ్యాసం అందించే సంస్థలు ఎన్నో ఉన్నా, వాటన్నింటికీ భిన్నమైన లక్ష్యాలతో సెంచూరియన్ విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని ఆయన చెప్పారు.
ఒడిశాలో అత్యంత మారుమూల, తీవ్రమైన నక్సల్స్ ప్రభావిత గ్రామీణ జనావాసంలో సెంచూరియన్ యూనివర్శిటీని ఏర్పాటు చేయడం వెనుక ప్రధాన లక్ష్యం అటువంటి ప్రాంతంలోని యువతకు సైతం ఉన్నతమైన ఆకర్షణీయమైన జీవనోపాధిని అందించే సంస్థలు ఇంకా ఉన్నాయనేది తేటతెల్లం చేయడమేనన్నారు.
దేశంలో అనేక విశ్వవిద్యాలయాలున్నా, సెంచూరియన్ యూనివర్శిటీ ప్రత్యేకత ప్రతి ఒక్కరికీ తొలి రోజు నుండే క్షేత్ర స్థాయి పని అనుభవాన్ని అందించడం, కౌశలాలను సామర్థ్యాలను పెంపొందించడం తద్వారా ప్రతి ఒక్కరూ తమ చదువు పూర్తి చేసుకునే సరికి ఆయా రంగాల్లో సమగ్రతను సంతరించుకునేందుకు దోహదం చేస్తోందని చెప్పారు.
ఒక విధంగా చెప్పాలంటే లక్ష మంది యువత కోసం దేశంలో సాంకేతిక వృత్తివిద్యా కోర్సుల్లో పని అనుభవాన్ని పాఠ్యప్రణాళికలో భాగంగా సమీకృతంగా అందించే ఏకైక వర్శిటీ సెంచూరియన్ విశ్వవిద్యాలయం అని పేర్కొన్నారు. పదో తరగతి, ఐటిఐ, సాంకేతిక వృత్తి విద్యా కోర్సులు చేస్తున్న వారు ఒక పక్క తమ చదువు కొనసాగిస్తూ మరో పక్క పరిశ్రమల్లో అప్రెంటిస్‌లుగా పని అనుభవాన్ని పొందేందుకు వీలుగా యూనివర్శిటీ వినూత్నమైన కరిక్యులమ్‌ను అమలుచేస్తోందని అన్నారు.
తరగతి గదిలో పాఠ్యప్రణాళిక అమలుతో పాటు క్షేత్రస్థాయిలో పని అనుభవం ప్రతి విద్యార్థి పొందేలా యూనివర్శిటీ కార్మిక మంత్రిత్వశాఖతో ఒప్పందం కుదుర్చుకుందని చెప్పారు. పరిశ్రమల్లో తమ విద్యార్థులను అప్రెంటిస్‌లుగా చేర్చి పని అనుభవాన్ని ఇస్తున్నామని, తద్వారా విద్యార్ధులు అప్రెంటిస్‌లుగా కొంత భృతిని పొందే వీలుందని, చదువుకుంటూ పనిచేసే గొప్ప అవకాశం యూనివర్శిటీలో ఉందని అన్నారు. మార్కెట్ డిమాండ్‌కు అనుగుణంగా నూతన ఒరవడిని సృష్టించేందుకు విశ్వవిద్యాలయం ప్రాంతీయ వర్క్‌షాప్‌లను నిర్వహిస్తూ పాఠ్యప్రణాళికలో అవసరమైన సవరణలు చేస్తోందని, నైపుణ్యాల అభివృద్ధికి అతి స్వల్ప సమయంలో ప్రశంసనీయమైన కృషిని రుజువు చేసుకున్న విశ్వవిద్యాలయంగా ఐక్యరాజ్యసమితి గుర్తింపును సైతం పొందిందని అన్నారు. గ్రామ్ తరంగ్ విభాగం ద్వారా 50 వేల మందికి వృత్తి నైపుణ్య శిక్షణ అందించడం వల్ల జీవితంలో స్థిరపడేందుకు ఈ శిక్షణ వారికి ఎంతో దోహదం చేసిందని చెప్పారు. తెలుగు రాష్ట్రాల్లోని విద్యార్థులకు సైతం ఉన్నత చదువులకు సెంచూరియన్ వర్శిటీ ఎప్పుడూ సిద్ధంగా ఉందని తెలిపారు. ఇతర వివరాలకు యూనివర్శిటీ పోర్టల్ తీతీతీ.షఖఆౄ.్ఘష.జశను సందర్శించాలని చెప్పారు.

సింహాచలేశుని ప్రహ్లాద మండపం
స్వర్ణతాపడం పనులు ప్రారంభం

సింహాచలం, జనవరి 4: సింహాచలం శ్రీవరాహ లక్ష్మీనృసింహ స్వామి వారి అంతరాలయంలోని ప్రహ్లాద మండపం, దానిపై భాగంలో ఉన్న మరో మండపం స్వర్ణతాపడం పనులు సోమవారం ప్రారంభమయ్యాయి. టేకుతో తయారు చేసిన మండపానికి బంగారుతాపడం చేసిన రాగిరేకులను అమరుస్తున్నారు. చెన్నైలో తయారు చేయించిన స్వర్ణతాపడం రేకులను ప్రత్యేకంగా వచ్చిన పనివారు అమరుస్తున్నారు. దేవస్థానం ఈవో రామచంద్రమోహన్, దేవాదాయశాఖ ఆభరణాల పర్యవేక్షణాధికారి ప్రసాదరావు స్వర్ణరేకుల అమరిక పనులు పరిశీలించారు. స్వర్ణతాపడం పనులకు అయ్యే వ్యయాన్ని ఒక భక్తుడు విరాళంగా ఇచ్చారు. దీని విలువ 50 లక్షల రూపాయలకు పైనే ఉంటుందని అంచనా. తొలుత ఆదివారం రాత్రి పాత మండపాన్ని తొలగించారు. మండపం తయారీలో వాడిన వెండిని భాండాగారంలో భద్రపరిచారు. స్వర్ణతాపడం రేకులను దేవాలయ సాంప్రదాయ రీతులలోనే తయారు చేయించారు. పాత మండపం అలంకరణలు ఎలా ఉన్నాయో అదే తరహాలోనే తీర్చిదిద్దారు. ప్రహ్లాద మండపంపై భాగంలో ఉన్న మరో మండపం ముందు భాగంలో శంకు, చక్ర, నామాలతో సుందరమైన పుష్పాలు, తీగలు చెక్కారు. మంగళవారం రాత్రికి అంతరాలయంలో అమరిక పనులు పూర్తి చేయడానికి అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. కాగా స్వామి వారి సన్నిధిలో కొలువుదీరి ఉన్న ప్రహ్లాద మండపం 1887వ సంవత్సరం ఏప్రిల్ నెలలో ఆలయ వ్యవస్థాపక ధర్మకర్తలు పూసపాటి వంశీయులు అమర్చినట్లు పాత మండపం వెండి రేకులపై చెక్కించారు. సుమారు 2 వేల 414 తులాల వెండితో మండపానికి రేకు అమర్చారు. ఈ మండపం శిథిలమైపోవడంతో 1946 మే 4వ తేదీన సుమారు 2 వేల 866 తులాల వెండితో తిరిగి రేకు అమర్చినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ప్రహ్లాద మండపం స్వర్ణ కాంతులు సంతరించుకుంటోంది.