ఆంధ్రప్రదేశ్‌

ఆంధ్రుల దత్తపుత్రుడిని

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నెల్లూరు, జూలై 24:‘ఆంధ్రప్రదేశ్ నన్ను దత్తత తీసుకుంది. నేను ఆంధ్రుల దత్తపుత్రుణ్ని, జీవితాంతం కొత్త రాష్ట్భ్రావృద్ధికి శాయశక్తులా సహకరిస్తా’ అని రైల్వే మంత్రి సురేష్ ప్రభు స్పష్టం చేశారు. ఆదివారం నెల్లూరు నగరంలో ఆయన రైల్వే సంబంధిత అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొత్తగా ఏర్పడ్డ రాష్ట్రానికి రైల్వే కేటాయింపుల్లో ప్రాధాన్యత ఇస్తున్నట్లు గుర్తు చేశారు. గత ప్రభుత్వాలు రైల్వేపరంగా మూడు దశాబ్దాల్లో చేయని పలు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను తాము మూడేళ్లలోనే పూర్తిచేయనున్నట్లు స్పష్టం చేశారు. భారీస్థాయిలో నిర్మిస్తున్న వంతెనలే ఇందుకు ఉదాహరణగా పేర్కొన్నారు. గతంలో రోజుకు కేవలం 4 కిలోమీటర్లు ప్రతిరోజు రైల్వేలైను ఏర్పాటయ్యేదని, ప్రస్తుతం 8 కిమీ స్థాయికి తీసుకువచ్చామన్నారు. మరో మూడేళ్లలో ప్రతిరోజు కొత్తగా 19 కిమీ లైను ఏర్పాటును లక్ష్యంగా నిర్దేశించుకున్నట్లు వెల్లడించారు.
కేంద్ర మంత్రి ఎం.వెంకయ్యనాయుడు మాట్లాడుతూ ఎపి ప్రయోజనాల దృష్ట్యా రాష్ట్రం నుంచి సురేష్ ప్రభు ప్రాతినిథ్యం కల్పించేలా తానే కృషి చేశానని, తన మాటను గౌరవించిన పార్టీ పెద్దలకు, రాష్ట్ర ముఖ్యమంత్రికి కృతజ్ఞతలని అన్నారు. ఎల్‌ఐసి ద్వారా రైల్వేలకు రూ.లక్షా 20 వేల కోట్ల రుణం అందనుందని, ఈ రుణంతో పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం ద్వారా భవిష్యత్తులో రైల్వే వ్యవస్థ మరింతగా రాణించగలదన్న ఆశాభావం వ్యక్తం చేశారు.
పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం
నెల్లూరు నగరంలోని ప్రధాన రైల్వేస్టేషన్ నుండి జిల్లాలోని గూడూరులో నిర్మించనున్న 4వ ప్లాట్‌ఫాం, యార్డు ఆధునీకరణ పనులను మంత్రులు రిమోట్ ద్వారా ప్రారంభించారు. అదేవిధంగా నెల్లూరు సౌత్ రైల్వేస్టేషన్‌లో పాదచారుల వంతెన, తిరుపతి ప్రధాన రైల్వేస్టేషన్‌లో హైస్పీడ్ వైఫై సౌకర్యాన్ని రైల్వే మంత్రి సురేష్ ప్రభు రిమోట్ సెన్సింగ్ విధానం ద్వారా నెల్లూరు నుంచే ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మంత్రి పి.నారాయణ, ఎంపిలు మేకపాటి రాజమోహన్‌రెడ్డి, వరప్రసాద్‌రావు, జడ్పీ చైర్మన్ బొమ్మిరెడ్డి రాఘవేంద్రరెడ్డి, నగర మేయర్ అబ్దుల్ అజీజ్, స్థానిక ఎమ్మెల్యేలు కోటంరెడ్డి శ్రీ్ధర్‌రెడ్డి, అనిల్‌కుమార్‌యాదవ్, దక్షిణ మధ్య రైల్వే జిఎం రవీంద్ర గుప్తా, జిల్లా కలెక్టర్ ఎం.జానకి తదితరులు పాల్గొన్నారు.

నెల్లూరు రైల్వే స్టేషన్‌లో అభివృద్ధి పనులను ప్రారంభిస్తున్న
కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు, రైల్వే మంత్రి సురేష్ ప్రభు తదితరులు