రాష్ట్రీయం

స్పీకర్ పదవి కత్తిమీద సాము

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి, జనవరి 5 : రాష్ట్ర శాసన సభ ప్రజా సంక్షేమాన్ని కాంక్షించే విధంగా చర్చలు జరిగి చట్టాలు రూపొందించడంతో పాటు రాష్ట్భ్రావృద్ధికి అవసరమైన కార్యాచరణ ప్రణాళికను రూపొందించేందుకు వేదిక కావాలని శాసనసభ సభాపతి కోడెల శివప్రసాద్ అన్నారు. అసెంబ్లీలో సభ్యులు పాటించవలసిన నియమ నిబంధనలపైన రూపొందించాల్సిన మార్గదర్శకాలపైన ఎథిక్స్ కమిటీ చైర్మన్, ఉప సభాపతి మండలి బుద్ద ప్రసాద్ అధ్యక్షతన ఆంధ్రప్రదేశ్ శాసన సభ నైతిక విలువలు సభ్యులు లోపల, బయట, అనుసరించాల్సిన ప్రవర్తనా నియమాళిపై తిరుపతిలోని మేధావులతో అభిప్రాయ సేకరణ చెయ్యడం కోసం మంగళవారం పద్మావతి అతిథి గృహంలో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా కోడెల శివప్రసాద్ మాట్లాడుతూ పవిత్రమైన శాసనసభలో ప్రతి సభ్యుడు సభా నిబందనలు పాటిస్తూ , సభ గౌరవాన్ని పెంపొందించేందుకు కట్టుబడి ఉండాలన్నారు. సభ సవ్యంగా జరిగినప్పుడే అర్థవంతమైన చర్చలు జరిగి ప్రజా సమస్యలకు పరిష్కార మార్గాలు లభిస్తాయన్నారు. 1998 వ సంవత్సరం నుండి యతిరాజారావు ఎథిక్స్ కమిటీ చైర్మన్ రూపొందించిన ప్రవర్తనా నియమావళిని కచ్చితంగా అమలు చేస్తున్నామన్నారు. ఇటీవల అసెంబ్లీ సమావేశాలు జరిగే సమయంలో పలుసార్లు వాయిదాలు వేయాల్సి వచ్చిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అసెంబ్లీ సమావేశాలు నిర్వహించేటప్పుడు స్పీకర్, డిప్యూటి స్పీకర్, ప్యానెల్ స్పీకర్‌ల పాత్ర కత్తి మీద సాములా ఉంటుందన్నారు. స్పీకర్‌పై విపరీతమైన బాధ్యత ఉందన్నారు. ఇలాంటి సమయంలో సభ్యులు నైతిక విలువలతో వ్యవహరిస్తే ప్రజలకు, రాష్ట్రానికి మేలు చేకూరుతుందన్నారు. సభా నియమావళిని రూపొందించడానికి మేధావుల సలహాలు సూచనలు తీసుకోవడంలో భాగంగానే గత ఏడాది ఆగస్టు విశాఖఫట్నంలో సమావేశాలు నిర్వహించామన్నారు. మూడవ పర్యాయంగా తిరుపతిలో ఈ సమావేశం ఏర్పాటు చెశామన్నారు. చివరగా హైదరాబాదులో కూడా సమావేశమై సలహాలు సూచనలు తీసుకుని వాటిని అసెంబ్లీ ముందు ఉంచి చర్చించి చట్టబద్దత కల్పించడానికి చర్యలు చేపడతామన్నారు. ఎథిక్స్ కమిటీ చైర్మన్ మండలి బుద్ద ప్రసాద్ మాట్లాడుతూ నైతిక విలువల సంఘం ప్రవర్తనా నియమాళిపై సమగ్ర చట్టం చెయ్యడానికి చర్యలు చేపడుతుందన్నారు. శాసన సభ ఒక దేవాలయం లాంటిదని ప్రస్తుతం అసెంబ్లీలో జరిగే సంఘటనలు చూపి ప్రజలు ఆందోళనలకు, ఆవేదనకు గురవుతున్నారన్నారు. సభ ప్రశాంతంగా నిర్వహించినపుడు ప్రజా సమస్యలు పరిష్కారమవుతాయన్నారు.