రాష్ట్రీయం

పెడధోరణులకు చెక్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 29: యూనివర్సిటీలు నిర్వహించే వివిధ రకాల ప్రవేశ పరీక్షల పేపర్లు లీక్ కాకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని సిఎం కె చంద్రశేఖర్‌రావు ఆదేశించారు. కొత్తగా నియమించిన వైస్ ఛాన్స్‌లర్లు, ఉన్నత విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ, ఉన్నత విద్యా ఉన్నతాధికారులతో క్యాంపు కార్యాలయంలో శుక్రవారం సమావేశమయ్యారు. వైస్ ఛాన్స్‌లర్ల నియామకాన్ని హైకోర్టు తప్పుపట్టిన అంశంతోపాటు రాష్ట్రంలో యూనివర్సిటీలను గాడిలో పెట్టడానికి తీసుకోవాల్సిన చర్యలపై సిఎం మార్గనిర్దేశం చేశారు. విద్యావేత్తలు, నిపుణులు, అనువజ్ఞులతో సమావేశమై వారి సిఫారసులపై ప్రభుత్వానికి నివేదిక ఇవ్వాలని వైస్ ఛాన్స్‌లర్లను సిఎం ఆదేశించారు. యూనివర్సిటీల్లో పెడధోరణులను పారద్రోలడానికి కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలన్నారు. వైస్ ఛాన్స్‌లర్ల నియామకంపై హైకోర్టు వ్యక్తం చేసిన అభ్యంతరాలపై రివ్యూ పిటిషన్ వేయడంతోపాటు సుప్రీం కోర్టుకు వెళ్లే అంశాన్ని న్యాయ విభాగం పరిశీలిస్తుందని, ఆ విషయాన్ని ప్రభుత్వం చూసుకుంటుందని సిఎం స్పష్టం చేసినట్టు తెలిసింది. ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పెంచేలా విద్యవిధానం ఉండాలే తప్ప నిరుద్యోగులను పెంచేలా కాదని అభిప్రాయపడ్డారు. దేశ, విదేశాల్లో మారుతున్న కాలానికి అనుగుణంగా యూనివర్సిటీలలో కొత్త కోర్స్‌లు ప్రవేశ పెట్టాలని సూచించారు. వర్శిటీలు విద్యార్థులు చదువుకోవడానికి, అధ్యయనానికి, పరిశోధనలకు వేదికగా ఉండాలన్నారు. గతంలో చాలామంది వైస్ ఛాన్స్‌లర్లు యూనివర్సిటీలను చక్కగా తీర్చిదిద్దారని, ఉన్నత విద్యా ప్రమాణాలు నెలకొల్పారని, వారిని స్ఫూర్తిగా తీసుకుని పని చేయాలన్నారు. ఉద్యోగ, ఉపాధి అవకాశాలు ఎక్కువగా ఉండే కోర్సులను ప్రవేశ పెట్టాలని, వీటి కోసం దేశ, విదేశాలలోని కోర్స్‌లపై అధ్యయనం చేయాలని సూచించారు. రాష్ట్రంలో ఏటా 40 నుంచి 45 వేల మంది బిఇడి, డిఇడి కోర్సులు పూర్తి చేస్తున్నారని, కానీ వారి సంఖ్యకు సరిపోయినన్ని ఉపాధ్యాయ పోస్టులు లేవని సిఎం ప్రస్తావించారు. ఇలాంటి వాటి వల్లనే నిరుద్యోగుల సంఖ్య పెరుగుతుందని ముఖ్యమంత్రి ఆవేదన వ్యక్తం చేశారు. చాలావరకు కోర్సుల పరిస్థితి ఇలాగే ఉందన్నారు. ఐటీ, ఫార్మా, ఇన్ఫా, మాన్యు ఫాక్చరింగ్ రంగాలు రాష్ట్రంలో బాగా విస్తరిస్తున్నాయని, ఈ రంగాలలో కోర్సులు చేసే వారు చదువుకుంటూనే పార్ట్‌టైమ్‌గా పని చేసుకునే విధంగా వెసులుబాటు కల్పించాలని సిఎం సూచించారు. ఆర్ అండ్ బి, పంచాయతీరాజ్, ఐబి, హౌసింగ్ తదితర శాఖలలో పెద్ద ఎత్తున పనులు జరుగుతున్నాయని సివిల్ ఇంజనీరింగ్ చేసే విద్యార్థులను వీటిలో భాగస్వామ్యం చేయడం ద్వారా స్కిల్ డెవలప్‌మెంట్ సాధ్యమవుతుందన్నారు. కొత్తగా ఏర్పడిన రాష్ట్రంలో విద్యా విధానం కూడా ఈ ప్రాంతానికి అనుగుణంగా ఉండాలని, ఆంధ్రప్రదేశ్ వారసత్వాన్ని కొనసాగించాల్సిన అవసరం లేదన్నారు. వైస్ ఛాన్స్‌లర్లుగా అవకాశం పొందిన వారు తమకు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సిఎం సూచించారు. యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ ఇచ్చే నిధులలో రాష్ట్రానికి అన్యాయం జరుగుతుందని ఈ విషయాన్ని ఇటీవల ప్రధానితో జరిగిన సమావేశంలో కేంద్రం దృష్టికి తీసుకెళ్లినట్టు వివరించారు. యూనివర్సిటీల వారీగా అవసరమైన నిధుల గురించి కూడా ప్రత్యేక నివేదిక ఇవ్వాలని, వీటి కోసం బడ్జెట్‌లో ఇక నుంచి కేటాయింపులు చేస్తామని సిఎం కెసిఆర్ చెప్పారు. బోగస్ కాలేజీలు లేకుండా చేయాలని, గుర్తింపు ఇవ్వడంలో అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి సూచించారు.

చిత్రం... తెలంగాణలోని వివిధ యూనివర్శిటీల వైస్ చాన్స్‌లర్లతో నిర్వహించిన సదస్సులో సిఎం కెసిఆర్