రాష్ట్రీయం

టిఎస్‌పిఎస్‌సికి సాధ్యమేనా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 5: తెలంగాణ రాష్ట్రంలో ఉపాధ్యాయ పోస్టుల భర్తీ బాధ్యతను పబ్లిక్ సర్వీసు కమిషన్‌కు అప్పగించే అంశంపై ప్రభుత్వం తీవ్రంగా యోచిస్తోంది. నిజాయితీగా, తొందరగా, ఎలాంటి ఇబ్బందులూ లేకుండా నియామకాలు చేసేందుకు వీలుకలుగుతుందని ప్రభుత్వం భావిస్తోంది. గతంలో డి.ఎస్సీ నియామకాల్లో జిల్లాల వారీ జాబితాలు తయారుచేయడానికే 20రోజుల నుండి రెండు నెలల వ్యవధి పట్టిన సందర్భాలున్నాయి. ఇంతా జరిగాక ఎంపిక జాబితాలపై ట్రిబ్యునల్‌లో లెక్కలేనన్ని కేసులు దాఖలు కావడం, వాటి పరిష్కారానికి నెలలు తరబడి పట్టడం అధికారులకు పెద్ద తలనొప్పిగా తయారైంది. గత ఏడాది ప్రకటించిన ఆంధ్రప్రదేశ్ డి.ఎస్సీ ఫలితాల నియామకాలు నేటికీ పూర్తికాలేదు. అనేక కేసులపై న్యాయపోరాటం కొనసాగుతోంది. తెలంగాణలో సైతం డి.ఎస్సీ నిర్వహణ పాఠశాల విద్య చేపడితే జిల్లాల వారీ వివాదాలు, కేసులు ఎదురవుతాయని ప్రభుత్వం భావిస్తోంది. అలాగే పరీక్ష తీరును తేలికగా మార్చేసి నిర్వహణ బాధ్యతను టిఎస్ పిఎస్‌సికి అప్పగిస్తే ఉత్తమమని భావిస్తోంది. డి.ఎస్సీ నిర్వహణకు ముందు టీచర్సు ఎలిజిబిలిటీ టెస్టును నిర్వహించనున్నారు. ఈ పరీక్ష ఏప్రిల్ రెండో వారంలో 9 లేదా 10వ తేదీన నిర్వహిస్తారు. ఒఎంఆర్ షీట్‌లో ఆబ్జెక్టివ్ టైప్‌లో దీనిని నిర్వహించనున్నారు. 10 రోజుల్లో ఫలితాలను ఇచ్చి డి.ఎస్సీ పరీక్ష నిర్వహించనున్నారు. దానికి అనుగుణంగానే డిఎస్సీ నోటిఫికేషన్‌ను మార్చిలో ప్రకటిస్తారు. మేలో ఎంపిక ప్రక్రియ పూర్తి చేసి, తుది జాబితాలను జూన్ మొదటి వారంలో ఇస్తారు. స్కూళ్లు తెరిచే నాటికి కొత్త టీచర్లు స్కూళ్లలో చేరేలా చర్యలు చేపడతారు.
టీచర్ల ఎంపికకు డి.ఎస్సీని ఆన్‌లైన్‌లో నిర్వహిస్తే ఎలా ఉంటుందనే ఆలోచన ప్రభుత్వానికి వచ్చింది. ప్రస్తుతం అనేక పరీక్షలను తెలంగాణ పబ్లిక్ సర్వీసు కమిషన్ ఆన్‌లైన్‌లో నిర్వహించి రెండు మూడు రోజుల్లో ఫలితాలను సిద్ధం చేయగలుగుతోంది. అదే విధంగా డి.ఎస్సీని కూడా ఆన్‌లైన్‌లో నిర్వహిస్తే బావుంటుందని ప్రభుత్వం యోచిస్తోంది. అయితే అందుకు తగ్గ వౌలిక వసతులు, సదుపాయాలు కమిషన్ దగ్గర ప్రస్తుతానికి లేవని ఒఎంఆర్ పద్ధతిలో పరీక్ష నిర్వహించేందుకు సిద్ధమని కమిషన్ వర్గాలు పేర్కొన్నట్టు తెలిసింది. అభ్యర్ధుల సంఖ్య 50వేలు దాటితే కంప్యూటర్ ఆధారిత ఎంపిక పరీక్షను నిర్వహించడం కష్టమని కమిషన్ వర్గాలు పేర్కొన్నట్టు తెలిసింది. టెట్‌కు దాదాపు 4 లక్షల మంది హాజరు అవుతారని అంచనా కాగా, డిఎస్సీకి కనీసం రెండున్నర నుండి మూడు లక్షల మంది హాజరుకానున్నారు.
గతంలో తెలంగాణలో ఖాళీల సంఖ్యపై అధికారులు సమీక్ష నిర్వహించినపుడు 10,961 వరకూ ఉంటాయని తేలింది. అయితే ఈ సంఖ్య తగ్గనుందని తెలిసింది. క్రమబద్ధీకరణ తర్వాత ఖాళీల సంఖ్య 8వేల వరకూ ఉండొచ్చని ఒక అంచనా. గతంలో ఖాళీల వివరాల ప్రకారం మహబూబ్‌నగర్‌లో 2024, ఆదిలాబాద్‌లో 1818, రంగారెడ్డిలో 1442, మెదక్‌లో 1257, నిజామాబాద్‌లో 944, హైదరాబాద్‌లో 763, ఖమ్మంలో 724, నల్లగొండలో 689, కరీంనగర్‌లో 666, వరంగల్‌లో 634 ఖాళీలు లెక్క తేలింది.
అయితే తాజా రిజర్వేషన్లు, రోస్టర్ తదితర అంశాలు చూశాక సంఖ్య తగ్గనున్నట్టు పాఠశాల విద్యాశాఖాధికారులు చెబుతున్నారు.