రాష్ట్రీయం

రైతుల ఆలోచనలో మార్పు రావాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నందిగామ, జనవరి 5: రైతుల ఆలోచన విధానంలో మార్పు తీసుకువచ్చి ముందు చూపుతో పంట కుంటలు (పంట సంజీవని) నిర్మించుకుంటే కరవును జయించవచ్చని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. కృష్ణా జిల్లా పెనుగంచిప్రోలు మండల కేంద్రంలో మంగళవారం జరిగిన జన్మభూమి గ్రామసభలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రతి ఐదు ఎకరాలకు పంట కుంటలు నిర్మించుకోవాలని, దీన్ని ప్రజా ప్రతినిధులు బాధ్యతగా తీసుకువెళ్లి ఆచరణలో చూపించాలన్నారు. పంట కుంటల వల్ల ఉపయోగాలను వివరించారు. అర్హులకు మాత్రమే సంక్షేమ పథకాలు దక్కాలన్నారు. దేనికైనా క్రమశిక్షణ ప్రధానమని, క్రమశిక్షణ లేకుంటే ఏ వ్యవస్థ అయినా కుప్పకూలుతుందన్నారు. ప్రతి ఒక్కరూ ఆర్థికాభివృద్ధి సాధించాలన్నారు. స్మార్ట్ విలేజ్ కానె్సప్ట్ విజయవంతం అయ్యేందుకు వివిధ రంగాల్లో స్థిరపడిన వారు ఎన్‌ఆర్‌ఐలు వారి గ్రామం (జన్మభూమి) అభివృద్ధికి చేయూతనందించాలని పిలుపునిచ్చామని, ప్రజా ప్రతినిధులు వివిధ దేశాలలో ఆర్థికంగా స్థిరపడిన వారిని గుర్తించి గ్రామాభివృద్ధిలో వారిని భాగస్వామ్యం చేయాలన్నారు. ఈ సందర్భంగా పలువురు లబ్ధిదారులకు సంక్షేమ పథకాలను అందజేశారు. సర్పంచ్ చింతల శ్రీలక్ష్మి గ్రామాభివృద్ధికి చేసిన వినతులపై సానుకూలంగా స్పందించి హామీలు ఇచ్చారు. పలువురు అధికారుల తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. సమయాభావం కారణంగా పూర్తి స్థాయిలో సమీక్ష నిర్వహించలేదు. తిరుపతమ్మ అమ్మవారి ఆలయాన్ని సందర్శించకుండానే హెలికాప్టర్‌లో తిరుగు ప్రయాణం అయ్యారు.
సభలో మంత్రులు దేవినేని ఉమామహేశ్వరరావు, కొల్లు రవీంద్ర, మాజీ మంత్రి నెట్టెం రఘురాం, జగ్గయ్యపేట, నందిగామ ఎమ్మెల్యేలు శ్రీరాం రాజగోపాల్, తంగిరాల సౌమ్య, ఎంఎల్‌సి ఎఎస్ రామకృష్ణ, జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ గద్దె అనురాధ, కలెక్టర్ బాబు ఎ, జాయింట్ కలెక్టర్ గంధం చంద్రుడు, సబ్ కలెక్టర్ డాక్టర్ సృజన తదితర అధికారులు, జన్మభూమి కమిటీ సభ్యులు, స్థానిక ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు. కాగా ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసి సమస్యలపై వినతి పత్రాన్ని ఇచ్చేందుకు జగ్గయ్యపేట నుండి బయలుదేరిన మాజీ ఎమ్మెల్యే, వైకాపా రాష్ట్ర రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యుడు సామినేని ఉదయభానుతో సహా మరి కొందరు వైకాపా నేతలను పోలీసు అధికారులు చిల్లకల్లు సమీపంలో ముందస్తుగా అదుపులోకి తీసుకొని వీరులపాడు పోలీస్ స్టేషన్‌కు తరలించటం గమనార్హం.

అంతర్ జిల్లా బదిలీల
చివరి తేదీ పొడిగింపు
ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, జనవరి 5: ఆంధ్రప్రదేశ్‌లో అంతర్ జిల్లాల బదిలీలకు దరఖాస్తు చేసుకునే గడువును మరో నాలుగురోజులు పొడిగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. దరఖాస్తులను ఆన్‌లైన్‌లో పంపించమని చెప్పిన ప్రభుత్వం అందుకు తగ్గట్టు ఆన్‌లైన్ డాటా అప్‌లోడింగ్ మార్గాన్ని సుగమం చేయకపోవడంతో టీచర్లు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఉపాధ్యాయ సంఘాల నాయకులు ప్రభుత్వం దృష్టికి తీసుకురావడంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. యుడైస్‌తో అనుసంథానం చేయడం వల్ల ఉపాధ్యాయులు చాలా ఇబ్బంది పడుతున్నారని యుటిఎఫ్ నేతలు పాఠశాల విద్యాశాఖ కమిషనర్ కె. సంధ్యారాణికి ఫిర్యాదు చేయడంతో తేదీ పొడిగింపుపై నిర్ణయం తీసుకున్నట్టు యుటిఎఫ్ అధ్యక్షుడు ఐ వెంకటేశ్వరరావు, ప్రధానకార్యదర్శి పి బాబురెడ్డి తెలిపారు. డిఇఓలు యుడైస్‌లో సమాచారాన్ని అప్‌లోడ్ చేయలేకపోవడం వల్ల చేసిన సమాచారంలో లోపాలు ఉండటం వల్ల నేటికీ దరఖాస్తు చేసుకోలేకపోతున్నారని , అలాగే స్పౌజ్‌కు సంబంధించి పాఠశాల మేనేజిమెంట్‌తో పాటు కేంద్ర, రాష్ట్ర ఇతర ప్రభుత్వ రంగ స్పౌజ్ దరఖాస్తులు స్కూల్ ఎడ్యుకేషన్‌లో ఓపెన్ కావడం లేదని, అన్నీ బాగుండి దరఖాస్తు చేసుకున్న వారు ప్రింట్ రావడం లేదని, ఇలాంటి సాఫ్ట్‌వేర్ సమస్యను సరిచేయాలని విద్యాశాఖాధికారులకు విజ్ఞప్తి చేయగా లోపాలు సరిచేస్తామని విద్యాధికారులు హామీ ఇచ్చారని వెంకటేశ్వరరావు పేర్కొన్నారు. కాగా ఎయిడెడ్ ప్రాధమిక పాఠశాలల ఉపాధ్యాయుల జీతాలకు వంద కోట్ల రూపాయిలను విడుదల చేసినట్టు కమిషనర్ కె .సంధ్యారాణి తెలిపారు.

ఇన్‌ఫార్మర్ నెపంతో
గిరిజనుడి హత్య
ముంచంగిపుట్టు, జనవరి 5: పోలీస్ ఇన్‌ఫార్మరనే నెపంతో విశాఖ ఏజెన్సీలోని ముంచంగిపుట్టు మండలం బూసిపుట్టు పంచాయతీకి చెందిన పాంగి శివయ్య (36) అనే గిరిజనుడిని సోమవారం రాత్రి మావోయిస్టులు హతమార్చారు. సాయుధులైన మావోయిస్టులు ఆదివారం శివయ్య గృహానికి చేరుకొని ఆయనను తమ వెంట తీసుకువెళ్లి ప్రజాకోర్టు నిర్వహించి సోమవారం రాత్రి బూసిపుట్టు పంచాయతీ సరియాపల్లి గ్రామసమీపంలో హతమార్చారు. శివయ్యను హతమార్చిన స్థలంలో పెదబయలు ఏరియా కమిటీ పేరున విడిచిపెట్టిన లేఖలో పోలీసు ఇన్‌ఫార్మర్‌లుగా పనిచేసే వారికి ప్రజాకోర్టులో శిక్ష తప్పదని హెచ్చరించారు.