ఆంధ్రప్రదేశ్‌

అంతర్రాష్ట్ర ఉద్యోగుల బదిలీలపై ‘అధికారిక’ కమిటీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, ఆగస్టు 3: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో పనిచేస్తున్న ప్రభుత్వ ఉద్యోగుల అంతర్రాష్ట్ర బదిలీలకు ఒక విధానాన్ని రూపొందించేందుకు ఐదుగురు ఉన్నతాధికారులతో కూడిన కమిటీని ఏర్పాటుచేస్తూ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులు ఉత్తర్వులు జారీచేశారు. విభజన సమయంలో ఉమ్మడి రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులుగా పనిచేస్తున్న భార్యాభర్తలు విభజన తరువాత వేర్వేరు రాష్ట్రాల్లో పనిచేయాల్సి వస్తోంది. ఇప్పటికే చాలామంది ఉద్యోగులు ఈ విషయంపై ప్రభుత్వానికి అర్జీలు పెట్టుకున్నారు. వీటిని పూర్తిస్థాయిలో పరిశీలించిన తరువాత ఈ సమస్యను పరిష్కరించేందుకు ఒక విధానాన్ని రూపొందించాలని నిర్ణయించింది. ఇందుకోసం ఐదుగురు ఉన్నతాధికారులతో కమిటీని నియమించింది. ఈ కమిటీలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సాధారణ పరిపాలనా విభాగానికి చెందిన ఎక్స్‌ఫిషియో ప్రిన్సిపల్ సెక్రటరీ, సెక్రటరీ టు గవర్నమెంట్ (సర్వీసెస్), తెలంగాణ ప్రభుత్వ సాధారణ పరిపాలనా విభాగానికి చెందిన ప్రిన్సిపల్ సెక్రటరీ టు గవర్నమెంట్, ఇదే రాష్ట్రానికి చెందిన సెక్రటరీ టు గవర్నమెంట్ (సర్వీసెస్), ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నుంచి అడిషనల్ సెక్రటరీ (ఎస్‌పిఎఫ్) లేదా జాయింట్ సెక్రటరీ (ఎస్‌పిఎఫ్) లేదా డిప్యూటీ సెక్రటరీ (ఎస్‌పిఎఫ్) సభ్యులుగా ఉంటారు. ఈ కమిటీ రెండు రాష్ట్రాల్లో పనిచేస్తున్న భార్యాభర్తలు కేసులు, లోకల్ క్యాడర్ ఉద్యోగుల పరస్పర బదిలీలు, అన్ని రాష్ట్రాల క్యాడర్ ఉద్యోగుల పరస్పర బదిలీలపై క్షుణ్ణంగా అధ్యయనం చేసి, ఒక విధానాన్ని రూపొందిస్తుంది. వీలైంత త్వీరలో ఈ విధానాన్ని రూపొందించాలని తెలంగాణ సిఎస్ రాజీవ్ శర్మ, ఏపి సిఎస్ టక్కర్ ఉత్తర్వులు జారీ చేశారు.