రాష్ట్రీయం

పుష్కరాలను ప్రశాంతంగా నిర్వహిద్దాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నాగార్జునసాగర్, ఆగస్టు 3: తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రాలు సమన్వయంతో పనిచేసి కృష్ణా పుష్కరాలు ప్రశాంతంగా నిర్వహిద్దామని తెలంగాణ రాష్ట్ర డిఐజి అకుల్ సబర్వాల్ అన్నారు. నాగార్జునసాగర్ విజయవిహార్‌లో బుధవారం రెండు రాష్ట్రాలకు చెందిన పోలీసు శాఖ డిఐజి స్థాయి నుండి డిఎస్‌పిల వరకు పుష్కరాలపై సమీక్షా సమావేశం నిర్వహించారు. అకుల్ సబర్వాల్ మాట్లాడుతూ కృష్ణా పుష్కరాలను రెండు రాష్ట్రాలు ప్రశాంత వాతావరణంలో నిర్వహించుకోవాలన్నారు. భక్తుల రద్దీకి తగ్గట్లుగా పోలీసు అధికారులు తగు చర్యలు తీసుకోవాలన్నారు. ట్రాఫిక్ తీవ్రతను తట్టుకోవడానికి పోలీసు శాఖలు అన్ని చర్యలు తీసుకుంటాయన్నారు. ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించడానికి, సమస్యలు ఏర్పడకుండా ఉండేందుకు గూడ్సు వాహనాలను రాత్రి 10 తరువాత రద్దీ తక్కువగా ఉంటే అనుమతిస్తామని తెలిపారు. కృష్ణానదిలో అనుమతి లేకుండా మర పడవలు, పుట్టీలు నడపకుండా జిల్లా అధికారులు నిషేధం ప్రకటించాలని తెలిపారు. వాకీటాకీల ద్వారా ఎప్పటికప్పుడు ఇరురాష్ట్రాల పోలీసులు సమాచారం ఇచ్చుకునే విధంగా వ్యవస్థ ఏర్పాటుచేసుకుంటున్నామన్నారు.
పూర్తిస్తాయిలో బందోబస్తు చర్యలు తీసుకుంటూ ఎప్పటికప్పుడు భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకోని తగిన చర్యలు తీసుకుంటామన్నారు. రెండు రాష్ట్రాల పోలీసులు, సిబ్బంది సమన్వయంతో పనిచేసి పుష్కరాలలో ఎటువంటి ఆటంకాలు లేకుండా పూర్తిచేసుకోవాలని అధికారులను కోరారు. ఈ సమావేశంలో హైదరాబాద్ రేంజ్ ఐజి నాగిరెడ్డి, ఆంధ్రా ఏలూరు డిఐజి సంజయ్, నల్లగొండ ఎస్‌పి ప్రకాశ్‌రెడ్డి, గుంటూరు ఎస్‌పి నారాయణనాయక్, ప్రకాశం ఎస్‌పి త్రివిక్రమ్‌రావు, మిర్యాలగూడ డిఎస్‌పి రామ్‌గోపాల్‌రావు, సిఐలు పార్థసారధి, ఆదిరెడ్డి, శ్రీ్ధర్‌రెడ్డి, పాండురంగారెడ్డి, ఎస్‌ఐలు రజనీకర్, ప్రసాద్‌రావు పాల్గొన్నారు.
సాగర్‌లో నూతన లాంచీలు ప్రారంభం
నాగార్జునసాగర్‌లో తెలంగాణ పర్యాటక అభివృద్ధి సంస్థకు చెందిన లాంచీ స్టేషన్‌ను, సుమారు రూ.2 కోట్లతో నిర్మించిన నూతన లాంచీ ఫల్గుణి అనే నూతన లాంచీని బుధవారం పర్యాటక శాఖ మంత్రి అజ్మీరా చందులాల్, విద్యుత్ శాఖమంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి ఎంపి గుత్తా సుఖేందర్‌రెడ్డితో కలిసి ప్రారంభించారు. మధ్యాహ్నం 3గంటలకు హిల్‌కాలనీ డౌన్‌పార్క్ వద్ద నూతనంగా ఏర్పాటుచేయనున్న లాంచీ నిర్మాణానికి సంబంధించి టిక్కెట్ కౌంటర్‌ను మంత్రులు ప్రారంభించారు. అనంతరం కొద్ది సేపు సాగర్ జలాలలో మంత్రులు లాంచిలో విహరించారు. అనంతరం బుద్ధవనంలో మొక్కలు నాటారు. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ సత్యనారాయణరెడ్డి, డిఐజి అకుల్ సబర్వాల్, ఎస్‌పి ప్రకాశ్‌రెడ్డి, డిఎస్‌పి రామ్‌గోపాల్‌రావు, టూరిజం జిఎం మనోహర్, డిస్ట్రిక్ట్ మేనేజర్ వెంకటేశ్వర్‌రావు, జిల్లా టూరిజం ఆఫీసర్ శివాజి, డ్యాం ఎస్‌ఇ రమేశ్, టిఆర్‌ఎస్ జిల్లా నాయకులు, జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ కర్నాటి లింగారెడ్డి, నియజకవర్గ ఇన్‌చార్జి నోముల నర్సింహయ్య, బ్రహ్మారెడ్డి, మలిగిరెడ్డి లింగారెడ్డి, విజయేందర్‌రెడ్డి, ఎంసి.కోటిరెడ్డి పాల్గొన్నారు.

పుష్కరాలపై సాగర్‌లో సమావేశమైన తెలుగు రాష్ట్రాల పోలీసు ఉన్నతాధికారులు