ఆంధ్రప్రదేశ్‌

కృష్ణమ్మకు తిరుమల వెంకన్న సారె

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుమల, ఆగస్టు 3: కృష్ణా పుష్కరాలను పురస్కరించుకుని కృష్ణమ్మకు సమర్పించేందుకు తిరుమల వేంకటేశ్వర స్వామివారి సారెతో కూడిన పుష్కర యాత్రను టిటిడి ధర్మకర్తల మండలి అధ్యక్షుడు డాక్టర్ చదలవాడ కృష్ణమూర్తి, ఇఓ డాక్టర్ డి.సాంబశివరావు బుధవారం తిరుమలలో ప్రారంభించారు. ముందుగా శ్రీవారి ఆలయంలో పూజలు నిర్వహించి పసుపు, కుంకుమ, పట్టువస్త్రాలను ఆలయం నుంచి శ్రీవారి వైభవోత్సవ మండపం వరకు ఊరేగింపుగా తీసుకొచ్చారు. విజయవాడలోని పిడబ్ల్యుడి మైదానంలోని శ్రీవారి నమూనా ఆలయంలో వివిధ రకాల కైంకర్యాలు నిర్వహించేందుకు శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామి ఉత్సవమూర్తులను, సారెను ఈ ప్రత్యేక రథంలో విజయవాడకు పుష్కరయాత్రగా తీసుకెళ్లనున్నారు. ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ ఈనెల 12 నుంచి 23వ తేదీ వరకు కృష్ణా పుష్కరాలు జరుగుతాయని తెలిపారు. టిటిడి భక్తుల సౌకర్యార్థం విజయవాడలోని పిడబ్ల్యుడి మైదానంలో శ్రీవారి నమూనా ఆలయాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు.
ఈ ఆలయాన్ని ఈనెల 7న ప్రారంభిస్తున్నట్లు తెలియజేశారు. ప్రతిరోజూ సుమారు లక్ష మంది భక్తులు స్వామివారిని దర్శించుకునేందుకు, అన్నప్రసాదాలు పంపిణీ చేసేందుకు తగు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలియజేశారు. ప్రతిరోజూ స్వామివారి ఉత్సవమూర్తులను ఊరేగింపుగా తీసుకువెళ్లి పుష్కర హారతి ఇస్తారని అన్నారు. పుష్కరాలలో టిటిడి సేవలను భక్తులు ఉపయోగించుకోవాలని ఆయన కోరారు. అనంతరం టిటిడి ఇఓ సాంబశివరావు మాట్లాడుతూ బుధవారం ప్రారంభమైన శ్రీవారి కల్యాణరథం మొదటిరోజు తిరుచానూరు పద్మావతి అమ్మవారి ఆలయం, ఒంటిమిట్ట కోదండరామ స్వామివారి ఆలయం, అహోబిలం లక్ష్మీనరసింహస్వామివారి ఆలయానికి చేరుకుంటుందని తెలిపారు. ఈనెల 4న అహోబిలం నుంచి ప్రారంభమై మహానంది ఆలయం, శ్రీశైలంలోని భ్రమరాంబికా సమేత మల్లికార్జున స్వామివారి ఆలయానికి చేరుకుంటుందన్నారు.
5న శ్రీశైలం నుంచి ప్రారంభమై మంగళగిరిలోని పానకాల నరసింహస్వామి ఆలయం, అమరావతిలోని అమరేశ్వర స్వామి ఆలయం, విజయవాడలోని దుర్గామల్లేశ్వర స్వామివారి ఆలయానికి చేరుకుంటుందని ఇఓ వివరించారు. ఈనెల 7వ తేదీ ఉదయం 7.30 నుంచి 9 గంటల మధ్య మహాసంప్రోక్షణ నిర్వహించి, ఉదయం 10 గంటల నుంచి భక్తులను శ్రీవారి దర్శనానికి అనుమతిస్తామని ఇఓ తెలిపారు.

కృష్ణమ్మకు తిరుమల వెంకన్న సారె,
పూజా సామగ్రిని ఊరేగింపుగా తీసుకొస్తున్న దృశ్యం