రాష్ట్రీయం

ఉపాధి హామీ ఉద్యోగులకూ 30 శాతం వేతనం పెంపు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఆగస్టు 4: జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (ఎన్‌ఆర్‌ఇజిపి) కింద పనిచేస్తున్న ఉద్యోగులకు కూడా ప్రస్తుతం చెల్లిస్తున్న వేతనంలో 30 శాతం పెంచాలని ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌రావు నిర్ణయించారు. గ్రామీణ పేదిరిక నిర్మూలన పథకం (సెర్ప్) కింద పనిచేస్తున్న ఉద్యోగుల వేతనాలను 30 శాతం, జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో పనిచేసే ఉద్యోగులకు 20 శాతం వేతనం పెంచనున్నట్టు రెండు రోజుల కిందట ముఖ్యమంత్రి ప్రకటించారు. అయితే తమకు కూడా సెర్ప్ ఉద్యోగుల మాదిరిగా 30 శాతం వేతనాన్ని పెంచాలని పలువురు ఉద్యోగులు, ఉద్యోగ సంఘాల నేతలు ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేయడంతో ఈ మేరకు వీరికి కూడా 30 శాతం పెంపుదలను వర్తింపచేయాలని ముఖ్యమంత్రి కెసిఆర్ అధికారులను ఆదేశించారు.