ఆంధ్రప్రదేశ్‌

డిజిటల్ వ్యాలీగా విశాఖ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, ఆగస్టు 5: దేశంలోనే డిజిటల్ వ్యాలీగా విశాఖను తీర్చిదిద్దనున్నట్టు రాష్ట్ర ఐటి శాఖ మంత్రి పల్లె రఘునాథ రెడ్డి ప్రకటించారు. ఉద్యోగాలకు కొదవ లేదని, సాంకేతికి పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకున్న ప్రతిభావంతులు పరిశ్రమకు కావాలన్నారు. మిరాకిల్ సాఫ్ట్‌వేర్ సొల్యూషన్స్ ఆధ్వర్యంలో విశాఖలోని ఆంధ్ర విశ్వవిద్యాలయం ఇంజనీరింగ్ కళాశాల ఆవరణలోని వైవిఎస్ మూర్తి ఆడిటోరియంలో నిర్వహిస్తున్న క్లౌడ్ కంప్యూటింగ్ టెక్నాలజీ శిక్షణా కార్యక్రమాన్ని ఆయన శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అందుబాటులో ఉన్న సాంకేతికను వినియోగించుకుంటేనే అభివృద్ధి సాధ్యమని తెలిపారు. ఆర్థిక వ్యవస్థకు సాంకేతిక పరిజ్ఞానం వెనె్నముక వంటిందన్నారు. రాష్ట్ర విభజన ముందు 3.3 లక్షల ఉద్యోగులు ఉండగా, ఇప్పుడు 22500 మంది మిగిలారని తెలిపారు. విభజన ముందు రాష్ట్రంలో ఐటి టర్నోవర్ 65 వేల కోట్ల రూ.లు కాగా, ఇప్పుడు కేవలం 1600 కోట్ల రూ.లు మాత్రమేనన్నారు. ఐటి రంగంలో చాలా పురోగతి సాధించాల్సి ఉందన్నారు. ఇప్పటికే ఐటి, ఎలక్ట్రానిక్, ఇన్నోవేషన్ విధానాలను ప్రకటించామని గుర్తు చేశారు. ఐటి రంగంలో పరిశ్రమలు పెట్టే వారికి అన్ని రకాల ప్రోత్సాహకాలను ఇస్తున్నామని తెలిపారు. డిజిటలైజేషన్‌కు సంబంధించి దేశంలోనే రాష్ట్రం ముందంజలో ఉందన్నారు. వివిధ రకాల అభివృద్ధి, సంక్షేమ పథకాలకు టెక్నాలజీ వినియోగించడం వల్ల అర్హులకు లబ్ధి చేకూరుతోందన్నారు. విశాఖను ఐటి హబ్‌గా, డిజిటల్ టెక్నాలజీ కేంద్రంగా అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు. ఈనెలాఖరునాటికి ఫైబర్ నెట్ వర్కు సేవలు అందుబాటులోకి వస్తాయన్నారు. పంచాయతీరాజ్ శాఖ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు మాట్లాడుతూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఐటి రంగానికి వనె్న తెచ్చిన ఘనత సిఎం చంద్రబాబుకే దక్కుతుందన్నారు. గృహ నిర్మాణ శాఖ మంత్రి కిమిడి మృణాళిని మాట్లాడుతూ ఐటి సేవల వినియోగం కారణంగా గ్రామాలు ఆర్థిక పరిపుష్ఠిని సాధించాయన్నారు.

సమావేశంలో మాట్లాడుతున్న రాష్ట్ర మంత్రి పల్లె రఘునాథ రెడ్డి