ఆంధ్రప్రదేశ్‌

పరిశ్రమలు వచ్చేస్తున్నాయ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఆగస్టు 5: ఆంధ్ర రాష్ట్రానికి పరిశ్రమల కళ వచ్చేసింది. కృష్ణా జిల్లాలో బంగారం శుద్ధి కర్మాగారం, అనంతపురం జిల్లాలో ఏరోస్పేస్ క్లస్టర్ ఏర్పాటుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పెట్టుబడుల ప్రమోషన్ బోర్డు ఆమోదం తెలిపింది. ఈ రెండు యూనిట్ల వల్ల రాష్ట్రంలో కొత్తగా 10045 మందికి ఉద్యోగాలు వస్తాయి. మొత్తం తొమ్మిది ప్రాజెక్టుల ఏర్పాటుకు బోర్డు అంగీకారం తెలిపింది. ఈ ప్రాజెక్టుల వల్ల రాష్ట్రానికి రూ. 7330 కోట్ల పెట్టుబడులు రానున్నాయి. ఈ యూనిట్లను నెలకొల్పే సంస్ధలకు ప్రోత్సాహకాలు ఇస్తామని ఏపిఐఐసి ప్రకటించింది. వాణిజ్య ఉత్పత్తి ప్రారంభించినప్పటి నుంచి వంద శాతం ప్రోత్సాహకాలు ఇస్తామని ఏపిఐఐసి తెలిపింది. కృష్ణా జిల్లాలో బంగారం శుద్ధి కర్మాగారాన్ని ఇండాని గ్లోబల్ ప్రైవేట్ లిమిటెడ్ ఏర్పాటు చేస్తుంది. ఈ పరిశ్రమను నెలకొల్పేందుకు రూ. 87 కోట్ల పెట్టుబడులు అవసరం. దేశంలో 32 బంగారు శుద్ధి కర్మాగారాలు ఉన్నాయి. ఇందులో 27 వరకు ప్రొసెస్ కర్మాగారాలే. ఇక్కడ శుద్ధి చేసిన బంగారాన్ని ఆభరణాల పరిశ్రమలకు, షాపులకు విక్రయిస్తారు. యారో కేబుల్స్ సంస్ధ రూ. 510 కోట్లతో కేబుల్స్ పరిశ్రమను కృష్ణా జిల్లాలో ఏర్పాటు చేయనుంది. ఈ పరిశ్రమ వల్ల 500 మందికి ఉపాధి కలుగుతుంది. కాగా భరత్ ఫోర్జ్ లిమిటెడ్ సంస్ధ రూ. 1400 కోట్లతో ఆటోమోటివ్ ఇండస్ట్రియల్ పార్కును ఏర్పాటు చేసేందుకు బోర్డు అంగీకరించింది. దీని వల్ల 3645 మంది ఉద్యోగాలు లభిస్తాయి.
నెల్లూరు జిల్లాలో ఈ సంస్ధకు భూమిని ఏపిఐఐసి కేటాయించింది. ఎన్‌లైవినింగ్ టెక్నాలజీస్ అనే సంస్ధ అనంతపురం జిల్లాలో రూ. 570 కోట్లతో ఏర్పాటు చేయనున్న ప్లాంట్‌లో ఐదు వందల మందికి ఉద్యోగాలు లభించనున్నాయి. అనంతపురం జిల్లాలో సుజియాన్ ఎనర్జీ సంస్ధ సంప్రదాయేతర ఇంధన వనరుల పరికరాలను తయారు చేసేందుకు అంగీకారం తెలిపింది. పవన విద్యుత్ టర్బైన్లకు బ్లేడ్స్‌ను ఉత్పత్తి చేస్తారు. ఈ పరిశ్రమ నెలకొల్పేందుకు రూ. 540 కోట్ల రూపాయలు పెట్టుబడులు రానున్నాయి. ఈ పరిశ్రమ వల్ల 2500 మందికి ఉపాధి లభించనుంది. విజయనగరం జిల్లాలో కొత్తవలస ఇన్‌ఫ్రా వెంచర్స్ సంస్ధ రెండు వేలకోట్ల రూపాయలతో పరిశ్రమను నెలకొల్పేందుకు బోర్డు ఆమోదం ఇచ్చింది. దీని వల్ల రెండు వేల మందికి ఉద్యోగాలు లభించనున్నాయి. చిత్తూరు జిల్లాలో గ్రీన్‌ప్లై పరిశ్రమను రూ. 758కోట్లతో ఏర్పాటు చేయనున్నారు. ఫైబర్ బోర్డులను ఈ పరిశ్రమలను తయారు చేస్తారు. ఇదే జిల్లాలో రూ. 260 కోట్ల వ్యయంతో సిసిఎల్ ప్రొడక్ట్స్ (ఇండియా) పరిశ్రమను ఏర్పాటు చేయనుంది. విశాఖపట్నంలో డక్కన్ పైన్ కెమికల్స్ సంస్ధ రూ. 1200 కోట్లతో సంయుక్త రంగంలో ఏర్పాటు చేసే పరిశ్రమ వల్ల 400 మందికి ఉద్యోగాలు లభించనున్నాయి.