రాష్ట్రీయం

మోదీ సభకు చురుగ్గా ఏర్పాట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఆగస్టు 5: ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొనే బహిరంగ సభకు బిజెపి చురుగ్గా ఏర్పాట్లు చేస్తోంది. ఈ నెల 7న మోదీ రాష్ట్రానికి మొదటి సారి వస్తున్న సంగతి తెలిసిందే. రాష్ట్ర ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు ఆహ్వానం మేరకు ప్రధాని పలు శంకుస్థాపన కార్యక్రమాల్లో పాల్గొనేందుకు వస్తున్నారు. తెలంగాణలో బిజెపిని బలోపేతం చేసేందుకు ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ కూడా ఇటీవల ప్రధానిని కలిసి రాష్ట్రానికి రావాల్సిందిగా ఆహ్వానించారు. అధికారిక కార్యక్రమాల్లో పాల్గొనేందుకు ప్రధాని తెలంగాణకు వస్తున్నందున పార్టీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవాల్సిందిగా ప్రధాన మంత్రి కార్యాలయం పార్టీ రాష్ట్ర నాయకత్వానికి సూచించింది. ఈ మేరకు 7న సాయంత్రం ఎల్.బి. స్టేడియంలో బహిరంగ సభను ఏర్పాటు చేశారు. తెలంగాణలోని ప్రతి పోలింగ్ కేంద్రం నుంచి ఐదుగురు చొప్పున కార్యకర్తలు బహిరంగ సభకు వచ్చే విధంగా పార్టీ నాయకులు ఏర్పాట్లు చేశారు. ఈ బహిరంగ సభ విజయంవంతం అయ్యేందుకు పార్టీ ఎమ్మెల్యే చింతల నేతృత్వంలో గురువారం యాగం నిర్వహించారు. శుక్రవారం కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ తదితరులు బహిరంగ సభ నిర్వహించే ఎల్.బి. స్టేడియంను సందర్శించి ఏర్పాట్లను పరిశీలించి పలు సూచనలు చేశారు.

జయశంకర్ జయంతి నేడు
ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, ఆగస్టు 5: దివంగత ఆచార్య కొత్తపల్లి జయశంకర్ జయంతిని శనివారం రాష్టవ్య్రాప్తంగా ఘనంగా నిర్వహించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ అధికారులను ఆదేశించారు. గ్రామ స్థాయి నుంచి రాష్టస్థ్రాయి వరకు అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, విద్యాసంస్థలు, ప్రభుత్వరంగ సంస్థలు, స్థానిక సంస్థలలో జయశంకర్ చిత్ర పటానికి పూలమాల వేసి నివాళులు అర్పించాలని రాజీవ్ శర్మ ఆదేశించారు.

ఇక టి-అగ్రి బిజినెస్
ఇంకుబేషన్ సెంటర్!
ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, ఆగస్టు 5: తెలంగాణ రాష్ట్రంలో టి-హబ్ తరహాలో టి-అగ్రి బిజినెస్ ఇంకుబేషన్ కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నట్టు వ్యవసాయ విశ్వవిద్యాలయం ఉప కులపతి డాక్టర్ వి ప్రవీణ్‌రావు తెలిపారు. ఉపకులపతిగా నియమితులైన సందర్భంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం విద్యార్థులు విశ్వవిద్యాలయం ఆడిటోరియంలో శుక్రవారం ఆయనను ఘనంగా సత్కరించారు. టి-అగ్రిబిజినెస్ ఇంకుబేషన్ వల్ల వ్యవసాయ విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులకు వ్యాపార రంగంలో మెలకువలు అందుతాయని చెప్పారు. బిఎస్సీ చివరి సంవత్సరం చదివే విద్యార్థులకు ఐదారు రంగాల్లో నైపుణ్యాభివృద్ధికి శిక్షణ కల్పిస్తామని చెప్పారు. వ్యవసాయ రంగంలో నూతన ఆవిష్కరణలు, నవకల్పనలు కోట్లాది మంది రైతుల జీవితాలను ప్రభావితం చేస్తాయని, విద్యార్థులు వాటిపై దృష్టి సారించాలని సూచించారు. వ్యవసాయ విశ్వవిద్యాలయంలో అంతర్జాతీయ ప్రమాణాలతో వౌలిక సదుపాయాలు కల్పించడానికి కృషి చేస్తున్నట్టు చెప్పారు. కార్యక్రమంలో విద్యార్థి నేతలు సంపత్, ఆర్ సాయికుమార్, శ్రీనివాస్ మాట్లాడారు. ప్రొఫెసర్ జయశంకర్ పేరు మీద యూజి, పీజి విద్యార్థులకు ఫెలోషిప్ ఏర్పాటు చేయాలని కోరారు. అధికారులు డాక్టర్ సుదర్శన్‌రెడ్డి, డాక్టర్ జమునారాణి, విష్ణువర్ధన్, వీరాంజనేయులు తదితరులు పాల్గొన్నారు.

హైదరాబాద్‌లో వ్యవసాయ వర్శిటీ ఉప కులపతిని సన్మానిస్తున్న విద్యార్థులు