రాష్ట్రీయం

సంస్థలను మూసివేస్తే మేకిన్ ఇండియా ఎలా సాధ్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 7: హెచ్‌ఎంటి వంటి ఎన్నో సంస్థలను మూసివేసి మేకిన్ ఇండియా ఎలా సాధ్యపడుతుందని సిఐటియు అఖిల భారత ప్రధానకార్యదర్శి, రాజ్యసభ సభ్యులు పతన్‌సేన్ ప్రధాని నరేంద్రమోదీని ప్రశ్నించారు. ప్రధాని నరేంద్రమోదీ మేక్ ఇన్ ఇండియా, మేడ్ ఇన్ ఇండియా, స్కిల్డ్ ఇండియా, డిజిటల్ ఇండియా వంటి నినాదాలతో దేశ ప్రజానీకాన్ని భ్రమల్లో ముంచుతున్నారని ఆయన విమర్శించారు. అంగన్‌వాడీ వర్కర్స్, హెల్పర్స్ అఖిల భారత సమాఖ్య మహాసభలో పాల్గొనేందుకు హైదరాబాద్‌కు విచ్చేసిన తపన్‌సేన్ గురువారం మీడియాతో మాట్లాడారు. కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వం కార్మిక, ప్రజా వ్యతిరేక విధానాలను అవలంభిస్తోందని పేర్కొన్నారు. మోదీ నిర్ణయాలు కార్పొరేట్లకు అనుగుణంగా వ్యవహరిస్తోందని అన్నారు. ఐసిడిఎస్ పరిరక్షణే ధ్యేయంగా అంగన్‌వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ అఖిల భారత సమాఖ్య (ఎఐఎఫ్‌డబ్ల్యూహెచ్) 8వ మహాసభ గురువారం హైదరాబాద్‌లో ప్రారంభమైంది. నగరంలోని ఆర్టీసి కళాభవన్‌లో ఉత్తేజభరిత వాతావరణంలో ఎఐఎఫ్‌డబ్ల్యూహెచ్ అఖిల భారత అధ్యక్షులు నీలిమా మైత్రి పతాకాన్ని ఆవిష్కరించారు.