రాష్ట్రీయం

ప్రతి నిమిషం ఒక ప్రమాదం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 7: రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రభుత్వాలు బహుముఖీన చర్యలు తీసుకుంటున్నా ప్రమాదాలు మాత్రం తగ్గలేదని తాజాగా నేషనల్ క్రైమ్ రికార్డ్సు బ్యూరో విడుదల చేసిన నివేదికలో స్పష్టమైంది. అన్ని రకాల ప్రమాదాలు తీసుకుంటే ప్రతి నిమిషం 16 మంది మృతి చెందుతున్నారు. వంద మందికి పైగా గాయపడుతున్నారు. రోడ్ల మరమ్మతులు చేయడం, వంకరటింకర్లుగా ఉన్న రహదార్లును నిటారుగా మార్చడం, శాస్ర్తియంగా రోడ్లు మరమ్మతులు చేయడం, వేగ నిరోధక హెచ్చరికలు జారీ చేయడం, సూచిక బోర్డులు, డ్రైవింగ్ చేసే వారికి మార్గదర్ళకాలు, సీటు బెల్టు ధరించడం, ద్విచక్రవాహనాలపై వెళ్లే వారు హెల్మట్లు వాడాలని నిర్బంధం చేయడంతో పాటు తాజాగా కర్నాటక వంటి రాష్ట్రాల్లో ద్విచక్రవాహనం వెనుక కూర్చున్న వారు సైతం హెల్మట్ వాడాలనే కొత్త నిబంధనను అమలులోకి తెచ్చింది. ఇన్ని చర్యలు తీసుకుంటున్నా ప్రమాదాలు మాత్రం తగ్గడం లేదు. ఈ నెల 11వ తేదీ నుండి అంతర్జాతీయ రహదారి భద్రతా వారోత్సవాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో జాతీయ సంస్థ తమ నివేదికను వెల్లడించింది.
2013లో రోడ్డు ప్రమాదాల వల్ల 4,00,517 మరణాలు సంభవించగా 2014 నాటికి ఆ సంఖ్య 4,51,757కు పెరిగింది. ప్రతి 52 రోడ్డుప్రమాదాల కారణంగా 52 మంది మరణిస్తున్నారు. రోడ్డు ప్రమాదాలు పలురకాలుగా జరుగుతున్నాయి. అందులో ట్రాఫిక్ యాక్సిడెంట్స్ వరకూ చూసుకుంటే దేశంలో 4,81,805 నమోదయ్యాయి. రైల్వేక్రాసింగ్ ప్రమాదాలు 2547 కాగా, రైల్వే ప్రమాదాల వల్ల జరిగిన మృతులు 1,69,107 మంది గాయపడిన వారు 4,81,739 మంది ఉన్నారు. 2013 కంటే 2014లో రోడ్డు ప్రమాదాలు 12.8 శాతం పెరిగాయి. రోడ్డు ప్రమాదాల్లో గాయపడిన వారిలో 36.3 శాతం మంది మరణిస్తున్నారు. ప్రకృతి సహజంగా జరుగుతున్న ప్రమాదాల్లో 20,201 మంది మరణిస్తున్నారు. అనూహ్యమైన ప్రమాదాల్లో ప్రతి గంటకూ 36 మంది మరణిస్తున్నారు. 2014లో అనూహ్యప్రమాదాలు వల్ల 6,36,509 కేసులు నమోదు కాగా అందులో 3,16,828 మంది మరణించగా, మరో 4,94,096 మంది గాయపడ్డారు. ప్రమాదాల్లో మరణిస్తున్న వారిలో 79.5 శాతం మంది పురుషులు కాగా, 20.5 శాతం మంది స్ర్తిలు ఉన్నారు. ప్రమాదాల్లో మరణిస్తున్న వారి వయోపరిమితి గమనించినపుడు ఎక్కువ మంది 18 నుండి 45 ఏళ్ల ప్రాయం వారేనని తేలింది. అనూహ్యమైన ప్రమాదాల్లో 60 మంది ట్రాన్స్ జండర్ కూడా ఉన్నారని నివేదిక పేర్కొంది. దేశంలో అత్యధికంగా మహారాష్టల్రో ప్రమాదాలు జరుగుతుండగా తర్వాతి స్థానాల్లో మధ్యప్రదేశ్, ఉత్తర ప్రదేశ్, తమిళనాడుల్లో జరుగుతున్నాయి. భవనాల్లో జరుగుతున్న ప్రమాదాలను తీసుకుంటే కేంద్ర పాలిత ప్రాంతాలను పరిశీలించినప్పుడు అత్యధికంగా అండమాన్ నికోబార్, పాండిచ్చేరి, మేఘాలయ, పంజాబ్, జమ్మూ-కాశ్మీర్, కేరళ, అరుణాచల్‌ప్రదేశ్, మిజోరాం, చండీఘడ్, దాదార్ నాగర్ హవేలీలో జరుగుతున్నాయి.