ఆంధ్రప్రదేశ్‌

పోలీసు పరిధినీ పునర్వ్యవస్థీకరించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఆగస్టు 30: కొత్త జిల్లాలను ఏర్పాటు చేస్తున్నందున పోలీసు వ్యవస్థను సైతం పునర్ వ్యవస్థీకరించాలని పలువురు శాసన సభ్యులు కోరారు. సైబరాబాద్ మహానగర పోలీసు సవరణ బిల్లును హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి మంగళవారం శాసన సభలో ప్రవేశపెట్టిన తరువాత జరిగిన చర్చలో పలువురు శాసన సభ్యులు కొత్త జిల్లాల ఏర్పాటు అంశాన్ని ప్రస్తావించారు. ‘ఉప్పల్ అసెంబ్లీ నియోజక వర్గం ముగ్గురు ఎసిపిల పరిధిలో ఉంది, అదే విధంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పలు అసెంబ్లీ నియోజక వర్గాల పరిస్థితి ఇదే. ఒక నియోజక వర్గం ఒకే డిఎస్‌పి, ఎసిపి పరిధిలో ఉండేట్టు చేయాల’ని పలువురు శాసన సభ్యులు కోరారు. ఉప్పల్ ఎమ్మెల్యేగా తాను ముగ్గురు ఎసిపిలతో మాట్లాడాల్సి వస్తోందని పలు నియోజక వర్గాల్లో ఇదే పరిస్థితి ఉందని ఉప్పల్ బిజెపి ఎమ్మెల్యే ఎంవివిఎస్ ప్రభాకర్ తెలిపారు. కొత్త జిల్లాలను ఏర్పాటు చేస్తున్నందున దానికి తగ్గట్టు పోలీసు పరిధిని మార్చాలని సూచించారు. రంగారెడ్డి జిల్లా నుంచి ఒక నియోజక వర్గం సైబరాబాద్ కమీషనరేట్ పరిధిలోకి మారిస్తే, రంగారెడ్డి జిల్లా ఎస్‌పి పరిధిలో మూడు నియోజకవర్గాలు మాత్రమే ఉంటాయని సభ్యులు తెలిపారు. నూతనంగా రాచకొండ కమీషనరేట్ ఏర్పాటు చేయడం పట్ల టిఆర్‌ఎస్ ఎమ్మెల్యే ప్రభాకర్‌రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు.